AP Elections 2024: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 45 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 స్థానాల్లో జనసేన లీడ్‌లో ఉండగా.. 7 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమి లీడ్‌లో ఉంది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంగళగిరిలో నారా లోకేశ్, పూతలపట్టులో మురళీమోహన్ […]
Pawan Kalyan in Lead in Pithapuram against Vanga Geetha: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం కొనసాగుతోంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన 4300 లీడ్‌లో ఉన్నారు. ఇక్కడ […]
All Eyes on Pithapuram Elections Results 2024: ఏపీలో మే 13న జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా? అని జనాలు ఆసక్తిగా ఉన్నారు. అయితే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ గెలుపుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. పిఠాపురంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి 86.63 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి అయినా […]
Nandamuri Ramakrishna Visits Kanaka Durga Temple: ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదల కానున్న నేపథ్యంలో మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుమారుడు నందమూరి రామకృష్ణ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని ఆయన అమ్మవారిని ఆకాంక్షించారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు […]
Nara Lokesh vs Murugudu Lavanya in Mangalagiri: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ రెండోసారి అధికారం చేపడుతుందా?.. లేదా కూటమి విజయం సాధిస్తుందా? అన్న ఆసక్తి అందరిలో ఉంది. అయితే అందరి దృష్టి మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై ఉంది. గత ఎన్నికలో ఓడిన ఆయన విజయం సాధిస్తారా? లేదా రెండోసారి […]
South Africa Beat Sri Lanka in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా ఘనమైన బోణీ కొట్టింది. గ్రూప్-డిలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్టార్ పేసర్ అన్రిచ్ నోకియా (4/7) ధాటికి లంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌట్ అయింది. కాగిసో రబాడ (2/21), కేశవ్ మహరాజ్ (2/22) కూడా చెలెరుగడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. 19 పరుగులు చేసిన కుశాల్ […]
Sanjay Leela Bhansali on Heeramandi Season 2: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంజయ్ తన సినిమాల మాదిరిగానే.. ఈ వెబ్ సిరీస్‌ని కూడా చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, రిచా చద్దా కీలక పాత్రల్లో నటించిన హీరామండి.. అందరి ప్రశంసలు అందుకుంది. స్వాతంత్ర్యానికి ముందు […]
Mailardevpally Wall Collapse: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్ రెడ్డి నగర్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి కురిసిన చిన్న వర్షానికి పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై డీఆర్ఆర్ టీం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి సీఐ మధు సహా చిన్నారుల తల్లిదండ్రులు స్పందించారు. ఎన్టీవీతో డీఆర్ఆర్ […]
Telangana Lok Sabha Elections 2024 Results: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజక వర్గాలు ఉన్నాయి. జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను మూడు చోట్ల […]
Team India Coach Rahul Dravid on New York Stadium: యూఎస్, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అయింది. లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో జరగనుంది. జూన్ 9న పాకిస్తాన్, 12న అమెరికాతో మ్యాచ్‌లు కూడా ఇదే మైదానంలో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ కూడా నాసౌవ్‌లోనే జరిగింది. అయితే ఈ […]