Sampath Kumar
Author- NTV Telugu-
MLC Elections 2025: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం!
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈసీ ఆదేశాల ప్రకారం.. పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలి. ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండడంతో.. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న ఉదయం 8 నుంచి పోలింగ్ ఆరంభం కానుంది. పోలింగ్‌కు మరో రోజే గడువు […] -
Sri Raja Rajeshwara Temple: వేములవాడలో వైభవంగా ప్రారంభమైన మహా శివరాత్రి వేడుకలు!
వేములవాడ రాజన్న సన్నిధిలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. రేపు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. శివరాత్రికి 1500 పోలీసులతో ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మహా శివరాత్రి జాతర కోసం వివిధ డిపోల నుండి 778 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు […] -
SLBC Tunnel Collapse: 72 గంటలు గడుస్తున్నా.. 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ!
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకుని 72 గంటలు (మూడు రోజులు) గడుస్తున్నా.. సహాయచర్యల్లో పెద్దగా పురోగతి లేదు. టన్నెల్లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇప్పటికి క్లారిటీ రాలేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్లోకి వెళ్లి.. ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎల్ అండ్ టీ టన్నెల్ నిపుణులు, రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు, జియాలజి నిపుణులు సహాయ చర్యల్లో ఉన్నా.. ఫలితం లేదు. టన్నెల్లో పూర్తిగా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని రెస్క్యూ బృందాలు […] -
Virat Kohli: అదే నా బలహీనతగా మారింది: కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ మైదానంలో అన్ని రకాల షాట్స్ ఆడుతాడు. ‘కవర్ డ్రైవ్’ బాగా ఆడతాడని కోహ్లీకి పేరు. అయితే ఇటీవల తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ షాటే తనకు బలహీనతగా మారిందని అంగీకరించాడు. ఇటీవలి కాలంలో కవర్ డ్రైవ్ కోసం ప్రయత్నిస్తూ.. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుతున్న సంగతి తెలిసిందే. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌పై మాత్రం అద్భుత కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. దీనిపై విరాట్ […] -
Axar Patel: విరాట్ కోహ్లీ సెంచరీ కోసం లెక్కలు వేశా: అక్షర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘కింగ్’ విరాట్ కోహ్లీ సెంచరీతో మెరిశాడు. 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో ఇది కోహ్లీకి 51వ సెంచరీ. చాలా కాలం తర్వాత వన్డేల్లో కింగ్ సెంచరీ చేయడంతో అతడి ఫాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అయితే పాకిస్థాన్‌పై విరాట్ సెంచరీ చేస్తాడో లేదో అని ఫాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు. అందుకు కారణం జట్టు చేయాల్సిన రన్స్ […] -
MLC Elections 2025: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. మార్చి 3న నోటిఫికేషన్.. మర్చి 20న పోలింగ్, కౌంటింగ్ జరగనున్నాయి. తెలంగాణలో 5 , ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29తో ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలు: 1.మహమ్మద్ మహమూద్ అలీ 2.సత్యవతి రాథోడ్ 3.శేరి […] -
Harish Rao: టన్నెల్లో 8 మంది చిక్కుకొని ఉంటే.. సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు!
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్లో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానా హంగామా చేశారని, కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యం అంటున్న ప్రభుత్వం.. కాలేశ్వరం ప్రమాదాన్ని అప్పటి ప్రభుత్వ […] -
MLC Kavitha: ‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత!
మాజీ సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ జిరాక్స్ సెంటర్‌ను ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుడైన సతీశ్‌కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్‌ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మలోత్ కవిత పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన ఉద్యమ […] -
Liquor Shops: తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్!
తెలంగాణలోని మందు బాబులకు బ్యాడ్ న్యూస్. 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి 27వ తారీకు సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని సగానికి పైగా […] -
Dr K Laxman: 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు.. ఎంపీ లక్ష్మణ్ సెటైర్లు!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అర్థమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికార పార్టీ (కాంగ్రెస్) తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను అరువు తెచ్చుకుందని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ (బీఆర్ఎస్)కి బరిలో నిలబడే అభ్యర్థులు కరువయ్యారని సెటైర్లు విసిరారు. బీఆర్ఎస్ హయంలో రాష్ట్రం దివాలా తీస్తే.. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం […]
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!