Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో అరుదుగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన రెండు ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ 49 ఏళ్ల నాటి బ్యాట్‌తో దిగిన ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. చిన్నప్పుడు బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోను, తాజాగా అదే పోజులో మరోసారి రీక్రియేట్ చేశారు.
ఈ రెండు ఫోటోల్లో సచిన్ పోజు మాత్రమే కాదు.. ఆయన చేతిలో ఉన్న బ్యాట్ కూడా ఒకటే కావడం విశేషం. దాదాపు 49 ఏళ్లుగా తనతోనే ఉన్న ఈ పాత బ్యాట్‌ను అభిమానులకు చూపించారు. ఈ ఫోటోలకు సచిన్ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. “49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది” అంటూ హార్ట్ ఎమోజీని జత చేశారు. దీంతో ఈ బ్యాట్‌తో తనకున్న అనుబంధం ఎంత ప్రత్యేకమైనదో చెప్పకనే చెప్పారు. ఇక సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన భారత్ తరఫున 200 టెస్టులు ఆడి 15,921 పరుగులు సాధించారు. 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో 10 పరుగులు సాధించారు. ఐపీఎల్లో 78 మ్యాచ్‌లు ఆడి 2,334 పరుగులు చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో బౌలర్‌గా కూడా సత్తా చాటిన సచిన్.. టెస్టుల్లో 46, వన్డేల్లో 154 వికెట్లు పడగొట్టారు.
Also Read
- CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
- Yash Thakur Duck out: ఒక్క పరుగు చేయకుండానే.. 16 ఏళ్ల తర్వాత ధోనీ, సచిన్, కోహ్లీల సరసన యశ్ ఠాకూర్..!
- India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
- Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
సచిన్ తన అంతర్జాతీయ కెరీర్లో ఏకంగా 100 సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇందులో టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు. 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆయన.. 2013లో చివరి మ్యాచ్ ఆడారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సచిన్ ప్రయాణం చాలా సాధారణంగా ప్రారంభమైంది. చిన్నతనంలో ఆయన వద్ద ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాట్ కూడా లేదు. బట్టలు ఉతికేందుకు ఉపయోగించే చెక్క దెబ్బ లాంటి చిన్నపాటి వస్తువుతో క్రికెట్ ఆడేవారు. అదే వస్తువును ఇప్పుడు 49 ఏళ్ల తర్వాత కూడా భద్రంగా ఉంచుకున్నారు. తన క్రికెట్ ప్రయాణం ఎక్కడ మొదలైందో గుర్తుచేసే ఈ జ్ఞాపకం సచిన్‌కు ఎంతో ప్రత్యేకమైనది.
Pehle bat ki baat hai, 49 saal baad bhi mere saath hai!❤️ https://t.co/kuRzxTfOoF
— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2026
తాజావార్తలు
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Janjatiya Gaurav Diwas: గిరిజనులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌లో ప్రధాని మోడీ విమర్శలు
-
Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
-
CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
ట్రెండింగ్
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!