200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR 700 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త సిరీస్‌ను తీసుకొచ్చేందుకు హానర్ (HONOR) సిద్ధమైంది. ఇప్పటికే టీజర్లతో ఆసక్తి పెంచిన కంపెనీ.. కొత్తగా HONOR 700 సిరీస్‌కు సంబంధించిన అనేక కీలక వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్‌ను నవంబర్ 23న చైనాలోని వుహాన్‌లో ప్రత్యేక ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. HONOR 700 సిరీస్‌లో మొత్తం మూడు స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇందులో బడ్జెట్ విభాగంలో HONOR 700S కాగా, మిడ్‌రేంజ్ విభాగంలో HONOR 700, ప్రీమియం ఫీచర్లతో HONOR 700 Pro మోడళ్లు లాంచ్ కానున్నాయి.
ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా 9,000mAh భారీ బ్యాటరీ కానుంది. 3 మోడళ్లలోనూ స్టాండర్డ్‌గా 9,000mAh క్వింగ్హై లేక్ బ్యాటరీని అందించనున్నారు. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 7.96mm మాత్రమే ఉండటం విశేషం. సిలికాన్-కార్బన్ యానోడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ బ్యాటరీ అధిక ఎనర్జీ డెన్సిటీని అందిస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే.. HONOR 700 సిరీస్‌లో కొత్త తరం “ఒయాసిస్ ఐ ప్రొటెక్షన్” స్క్రీన్‌ను అందిస్తున్నారు. ఇది 1.5K రిజల్యూషన్, 3840Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌తో వస్తుంది. అలాగే డిస్ప్లే చుట్టూ కేవలం 0.98mm సిమెట్రికల్ బెజెల్స్ ఉండనున్నాయి.
Also Read
- HMD 2320 Flip 4G: HMD 2320 Flip 4G త్వరలో లాంచ్?.. Unisoc చిప్, 4G సపోర్ట్, 32GB వరకు స్టోరేజ్!
- SpaceX: చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. అంతరిక్షం నుంచి వచ్చిన స్టార్‌షిప్‌ను గాల్లోనే పట్టుకున్న లాంచ్ టవర్
- Panasonic ToughBook FZ-G3: Panasonic కొత్త రగ్డ్ టాబ్లెట్ ToughBook FZ-G3 లాంచ్.. 16GB RAM, 512GB SSD
- Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్‌లో లాంచ్.. BIS సర్టిఫికేషన్‌లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
పెర్ఫార్మెన్స్ పరంగా HONOR 700 లో Snapdragon 8s Gen 4, , HONOR 700 Pro లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్లను అందించనున్నారు. హానర్ ఫాంటమ్ ఇంజిన్ టెక్నాలజీతో వీటిని మరింత ఆప్టిమైజ్ చేయనున్నారు. మూడు మోడళ్లలోనూ థర్డ్ జనరేషన్ RF C3 చిప్, MagicOS 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. అంతేకాకుండా ఆపిల్ ఎకోసిస్టమ్‌తో క్రాస్ ప్లాట్‌ఫామ్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా అందించనున్నారు. కెమెరాల విషయానికి వస్తే.. మూడు మోడళ్లలోనూ 200MP ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. 4K సినిమాటిక్ లైవ్ రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది. HONOR 700, HONOR 700 Pro మోడళ్లలో అదనంగా 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఇవ్వనున్నారు. ఇది 3.5x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 200MP సాఫ్ట్ లైట్ కెమెరా సిస్టమ్‌తో పాటు వేరియబుల్ సాఫ్ట్ లైట్ రింగ్‌ను కూడా అందిస్తున్నారు.
ఈ సిరీస్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ BackDuoFen పేరుతో తీసుకొస్తున్న సెకండరీ డైనమిక్ రియర్ డిస్ప్లే. YOYO Doubao AI అసిస్టెంట్‌తో అనుసంధానమైన ఈ చిన్న స్క్రీన్ ద్వారా నోటిఫికేషన్లు, విడ్జెట్లు, AI స్టిక్కర్లు, ఇతర సిస్టమ్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వెనుక కెమెరాలతో సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఈ డిస్ప్లే ప్రివ్యూ స్క్రీన్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక సైడ్ బటన్‌ను కూడా అందించనున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వెనుక కెమెరా మాడ్యూల్లోనే హై ప్రెసిషన్ PPG సెన్సార్‌ను అమర్చారు. దీని ద్వారా కేవలం 60 సెకన్లలో హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలు, హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV) వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పటికే HONOR 700 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ముందస్తు బుకింగ్ చేసుకునే వారికి 365 రోజుల రీప్లేస్మెంట్ పాలసీని కూడా అందిస్తోంది. ఈ ఫోన్ల ధరలు, ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, ఇతర దేశాల్లో విడుదల తేదీలను నవంబర్ 23న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్లో వెల్లడించనుంది.
తాజావార్తలు
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
-
Aaryavir Sehwag: పాక్‌పై గెలుపు వెనుక అసలు ప్లాన్ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఆర్యవీర్! సెహ్వాగ్!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
CM Revanth Reddy- PM Modi: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!