200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR Magic9 Pro Max: హానర్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Magic9 Pro Max గ్లోబల్ మార్కెట్లలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఈ నెల ప్రారంభంలో హాంకాంగ్‌లోనూ లాంచ్ చేయగా.. అక్కడ ఇప్పటివరకు 5 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 24న మలేషియాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా తదితర అంతర్జాతీయ మార్కెట్లలోనూ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.
అయితే ఈ మొబైల్ లో డిజైన్ విషయంలో కంపెనీ కీలక మార్పులు చేసింది. గతంలో మ్యాజిక్ సిరీస్ ఫోన్లలో కనిపించిన గుండ్రటి కెమెరా మాడ్యూల్ స్థానంలో ఈసారి చతురస్రాకార కెమెరా హౌసింగ్‌ను అందించింది. ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ కెమెరా వ్యవస్థ. ప్రముఖ సినిమా కెమెరా పరికరాల తయారీ సంస్థ ARRI సహకారంతో కెమెరా టెక్నాలజీని అభివృద్ధి చేశారు. కెమెరా విభాగంలో 200MP ప్రైమరీ కెమెరాను అందించారు. దీనికి సెన్సార్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. దీనితో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. వీడియోల కోసం ARRI LogC3 కర్వ్ రికార్డింగ్, ARRI Looks, ప్రొఫెషనల్ LUT ప్రొఫైల్స్ వంటి ఫీచర్లను అందించారు. ముఖ్యంగా మొబైల్లోనే సినిమాటిక్ వీడియోలు చిత్రీకరించి ఎడిటింగ్ చేయాలనుకునే వారికి ఈ ఫీచర్లు ఉపయోగపడనున్నాయి.
Also Read
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
- HMD 2320 Flip 4G: HMD 2320 Flip 4G త్వరలో లాంచ్?.. Unisoc చిప్, 4G సపోర్ట్, 32GB వరకు స్టోరేజ్!
- SpaceX: చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. అంతరిక్షం నుంచి వచ్చిన స్టార్‌షిప్‌ను గాల్లోనే పట్టుకున్న లాంచ్ టవర్
- Panasonic ToughBook FZ-G3: Panasonic కొత్త రగ్డ్ టాబ్లెట్ ToughBook FZ-G3 లాంచ్.. 16GB RAM, 512GB SSD
డిస్ప్లే విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 6.8 అంగుళాల LTPO OLED స్క్రీన్‌ను అందించారు. ఇందులో అడాప్టివ్ హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. Qualcomm స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 చిప్సెట్తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. గరిష్ఠంగా 16GB ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లోనూ అందుబాటులో ఉండనుంది. బ్యాటరీ విషయంలోనూ HONOR ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అధిక ఎనర్జీ డెన్సిటీ కలిగిన సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించారు. దీనికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. మలేషియాలో లాంచ్‌కు ముందే HONOR ప్రత్యేక ప్రీ-రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో నిర్వహించే సర్వేలో పాల్గొనే వారికి ఐదు HONOR ఛాయస్ వాచ్ 2 ఎపిక్ స్మార్ట్‌వాచ్‌లను గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. వీటి మొత్తం విలువ RM 2,495గా పేర్కొంది. అంతేకాకుండా అధికారిక ఛానళ్ల ద్వారా లాంచ్ తర్వాత ఫోన్ కొనుగోలు చేసే రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారులకు 2X పాయింట్స్ బూస్ట్ వోచర్ కూడా అందించనుంది. కాకపోతే ధర, స్థానిక వారంటీ వివరాలు, ప్రీ-ఆర్డర్ ఆఫర్లను నవంబర్ 24న జరిగే లైవ్ లాంచ్ ఈవెంట్లో వెల్లడించనుంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలపై కూడా త్వరలో స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
Koti Deepotsavam Day 2: కోటి దీపోత్సవం రెండో రోజు విశేష పూజలు.. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
-
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం.!
-
Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?