Afghanistan Coach: ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ కోచ్!
- ఆఫ్ఘనిస్తాన్ కోచ్‌గా ఆర్ శ్రీథర్
- ట్రాట్ అండర్‌లో చేయనున్న శ్రీథర్
- దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్, దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శ్రీథర్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీథర్ పని తీరును బట్టి ఒప్పందంపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది.
‘న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టు, దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సహాయ కోచ్‌గా ఆర్ శ్రీధర్‌ను నియమించాం. శ్రీధర్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాలని, భవిష్యత్తులో అతనితో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోవాలని బోర్డ్ కోరుకుంటోంది’ అని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ అండర్‌లో శ్రీధర్ పని చేయనున్నారు. సెప్టెంబర్ 9 నుంచి ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ నోయిడాలో జరగనుంది.
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
Also Read: Rohit Sharma-Shreyas: రోహిత్‌కు సీటు ఇచ్చిన శ్రేయస్.. వీడియో వైరల్!
54 ఏళ్ల శ్రీథర్ 2021 టీ20 వరల్డ్‌కప్ వరకు రవిశాస్త్రి అండర్‌లో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశారు. 2008-14 వరకు నేషనల్ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ ఫీల్డింగ్ మరియు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు. 2014 ఇండియా అండర్-19 వరల్డ్‌కప్ స్క్వాడ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. 1989-2001 మధ్య దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ తరపున 35 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 15 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడారు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!