గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మళ్లీ రికార్డ్ గరిష్ఠాలకు బంగారం ధర చేరువైంది. బడ్జెట్ 2024 అనంతరం భారీగా తగ్గిన పసిడి రేట్లు.. క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలి రోజల్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. స్వల్పంగా మాత్రమే తగ్గుతున్నాయి. దాంతో 24 కారెట్ల ధర మరోసారి 73 వేలకు చేరువైంది. 22 కారెట్లపై నిన్న రూ.500 పెరగగా.. నేడు రూ.300 మాత్రమే తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,870లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.66,950 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.72,970గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,870గా నమోదైంది.
Also Read: Manu Bhaker: రిపోర్టర్స్ వరుస ప్రశ్నలు.. మను బాకర్ అసహనం!
వరుసగా రెండోరోజు వెండి ధర స్థిరంగా ఉంది. గురువారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.87,000గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ87,000లుగా ఉండగా.. చెన్నైలో రూ.92,000లుగా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.84,900గా.. హైదరాబాద్‌లో రూ.92,000లుగా ఉంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.92,000ల వద్ద కొనసాగుతోంది.