Brand Value: కంపెనీల క్యూ.. ఒక్కసారిగా పెరిగిన వినేశ్, మను బాకర్ సంపాదన!
- పెరిగిన వినేశ్ బ్రాండ్ విలువ
- 25 లక్షల నుంచి కోటి
- మను పారితోషకం 1.5 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనూహ్య రీతిలో పతకానికి దూరమైన విషయం తెలిసిందే. 50 కేజీల విభాగంలో ఫైనల్ బౌట్‌కు ముందు 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అయితే పతకం కోల్పోయినా ఆమెకు దేశవ్యాప్తంగా ఎంతో మద్దతు లభించింది. స్వదేశానికి వచ్చినపుడు అపూర్వ స్వాగతం దక్కింది. ఇప్పుడు వినేశ్ బ్రాండ్ విలువ కూడా ఒక్కసారిగా పెరిగింది.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత వినేశ్ ఫొగాట్ పారితోషకం నాలుగు రెట్లు పెరిగిందట. ఒక్కో ప్రకటనకు గతంలో రూ.25 లక్షలు పారితోషకం తీసుకున్న వినేశ్‌కు ఇప్పుడు ఏకంగా రూ.కోటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన యువ షూటర్ మను బాకర్ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరిగింది. గతంలో ఒక్కో ప్రకటనకు రూ.25 లక్షలు తీసుకున్న మను పారితోషకం రూ.1.5 కోట్లకు చేరుకుందట. ఈ ఇద్దరి కోసం పలు కంపెనీలు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది.
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
Also Read: Rohit Sharma: ఆ ముగ్గురి మద్దతుతో ప్రపంచకప్ గెలిచాం: రోహిత్
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించి బ్రాండ్ల ఫేవరెట్‌గా మారిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌లో రజతానికే పరిమితం అయ్యాడు. అయినప్పటికీ నీరజ్ పారితోషకం 30 శాతానికి పైగా పెరిగినట్లు తెలుస్తోంది. క్రికెటర్స్ తర్వాత ఈ ముగ్గురు చాలా ప్రకటనలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!