Sampath Kumar
Author- NTV Telugu-
Ponnam Prabhakar: నా క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండి.. విత్తనాలు ఫ్రీగా ఇస్తా!
విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాము విత్తనాలు అందిస్తాం అని, రైతులు ఖాళీ జాగా లేకుండా పంటలు వేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు, పాడి పంటలతో తెలంగాణ దేశంలో అత్యధిక ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ […] -
WTC Final 2025: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్! 27 ఏళ్ల కల నెరవేరేనా?
2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని రికార్డు ఉన్న ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలవడం దక్షిణాఫ్రికాకు అంత తేలికేం కాదు. డబ్ల్యూటీసీలో ఇది మూడో ఫైనల్. తొలి రెండు డబ్ల్యూటీసీ ట్రోఫీలను […] -
Dr K Laxman: పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టింది.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా!
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అనే రీతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ విమర్శించారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు అనుకుంటా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 18 మాసాల పాలన విశ్లేషిస్తే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. పేద, వెనుకబడిన వర్గానికి చెందిన నరేంద్ర మోడీ […] -
Adluri Laxman: ఆ ఇద్దరు నాకు రెండు కళ్లు.. వారి సహకారంతోనే ఇంతటి వాడిని అయ్యా!
మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు రెండు కళ్లు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి సహాయ సహకారాలతోనే తాను ఇంతటి వాడిని అయ్యాను అని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు వచ్చిందని, తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా అన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి దక్కిన విషయం […] -
Thatikonda Rajaiah: కడియం దగ్గర భజనపరుల సంఖ్య పెరుగుతోంది!
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దగ్గర భజనపరుల సంఖ్య పెరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరిని చూస్తే సొంత పార్టీ నేతలే భయపడుతున్నారని విమర్శించారు. కడియం పని చేయాలంటే కమిట్మెంట్ కావాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కడియం అనుచరులు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో 1994-2004 నాటి కడియం నిరంకుశ పాలన మళ్లీ ప్రారంభమైందని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. స్టేషన్ ఘన్పూర్ మీడియా సమావేశంలో […] -
KCR: రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఓపెన్ కోర్టు విచారణకు ఒప్పుకోకుంటే?
రేపు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్‌లోని కాళేశ్వరం కమీషన్‌కు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 6న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, 9న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఓపెన్ కోర్టులో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో […] -
MLA Raja SIngh: కుల సమీకరణ ఆధారంగా బీజేపీ అభ్యర్థి.. ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ఆరు నెలల తర్వాత ఉంటుందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఉప ఎన్నికల కోసం కుల సమీకరణ ఆధారంగా అభ్యర్థిని బీజేపీ నిర్ణయించబోతోందని పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంకును బీఆర్ఎస్కి ఎంఐఎంలు విక్రయించారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు ఏ పార్టీకి అమ్ముతారో చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ […] -
Uttam Kumar Reddy: అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
రెండు రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. రెండు గంటలకు పైగా చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల పైనా విస్తృతమైన చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి […] -
Kaleshwaram Commission: మరోసారి కేసీఆర్, హరీష్ రావు భేటీ.. మరో నివేదిక సిద్దం!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, హరీశ్ రావు మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు విచారణ అంశంపై చర్చిస్తున్నారు. బలప్రదర్శన ఏర్పాట్లపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్‌కి ఇచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. అయితే హరీష్ రావును […] -
Crime News: సరూర్‌నగర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త!
కలకాలం తోడు నీడగా ఉండాల్సిన భర్త అనుమానంతో భార్యను కడతేర్చాడు. వివాహేతర సంబంధం ఉందనే కారణంతో భార్యను చున్నీతో ఉరివేసి చంపాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. భార్యను చంపిన తర్వాత భర్త పోలీసులకు లొంగిపోయాడు. తన భార్యను తానే చంపినట్లు పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న సరూర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. Also Read: Balakista Reddy: ఆగస్టు 14 లోపు ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభిస్తాం.. డబ్బులు వృధా […]
తాజావార్తలు
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!