Britney Spears Marriage: తనను తానే పెళ్లి చేసుకుని.. హనీమూన్‌కు వెళ్లిన బ్రిట్నీ స్పియర్స్!
- పెళ్లి చేసుకున్న బ్రిట్నీ స్పియర్స్
- ఒంటరిగా హనీమూన్‌కు బ్రిట్నీ
- షాక్ అవుతున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (42) తన భర్త సామ్ అస్ఘరీ (30) నుంచి ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే. బ్రిట్నీ, అస్ఘరీలు 2022లో వివాహం చేసుకోగా.. 14 నెలల వ్యవధిలో వారి పెళ్లి బంధం ముక్కలైంది. 2023లో విడాకుల కోసం ఈ జంట దరఖాస్తు చేసుకోగా.. గత మే నెలలో డివోర్స్ ఒప్పందానికి వచ్చింది. అయితే బ్రిట్నీ తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
తనను తానే పెళ్లి చేసుకున్నానని బ్రిట్నీ స్పియర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ‘నన్ను నేనే పెళ్లి చేసుకున్న రోజు ఇది (అక్టోబరు 21). ఇది మీకు చాలా ఇబ్బందిగా, తెలివితక్కువ పనిగా అనిపించవచ్చు. కానీ నా జీవితంలో నేను చేసిన అద్భుతమైన పనిగా భావిస్తున్నా’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు పెళ్లిగౌను ధరించిన పోటోలను, వీడియోను షేర్ చేశారు. వీడియోలో నవవధువులా నిలబడిన బ్రిట్నీ పక్కన వరుడు ఎవరూ లేరు. అంతేకాదు ఖాళీగా ఉన్న చర్చి ఫొటోను షేర్ చేశారు.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
Also Read: IND vs NZ 2nd Test: దాచడానికేమీ లేదు.. రాహుల్-సర్ఫరాజ్ మధ్య పోటీ ఉంది: కోచ్
బ్రిట్నీ స్పియర్స్ మరో పోస్ట్ కూడా చేశారు. ఒంటరిగా హనీమూన్‌కు బయలుదేరుతున్నట్లు విమానం పక్కన నిలబడి ఉన్న ఫొటో పెట్టారు. ‘టక్స్ అండ్ కేకస్.. నేను వచ్చేశా’ అని పేర్కొన్నారు. టక్స్ అండ్ కేకస్ అంటే దీవులు. ఇవి అట్లాంటిక్ సముద్రంలో ఉన్నాయి. బ్రిట్నీ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. 42 ఏళ్ల బ్రిట్నీకి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు నాలుగో పెళ్లి అన్నమాట.
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!