గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగారం ధర 80 వేల మార్క్ దాటేయగా.. సిల్వర్ లక్ష దాటేసింది. అయితే గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్‌కు కాస్త బ్రేక్ పడింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (అక్టోబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర […]
టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్‌కు రోజురోజుకు మాజీల నుంచి మద్దతు పెరుగుతోంది. సర్ఫరాజ్‌కు ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సపోర్ట్ చేయగా.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా మద్దతు ఇచ్చాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సర్ఫరాజ్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఆకాశ్ సూచించాడు. అతడిని పక్కనపెట్టేందుకు కారణం ఏదీ కనిపించడం లేదన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఈ వారంలోగా బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. బుధవారం ఓ […]
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో రెండో టెస్ట్ ఆడుతున్నట్లు కివీస్ కెప్టెన్ చెప్పాడు. గాయంతో మాట్ హెన్రీ దూరం కాగా.. మిచెల్ సాంట్నర్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. అందరూ అనుకున్నట్లే కేఎల్ రాహుల్‌ను తుది జట్టు నుంచి […]
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్ రిషబ్ పంత్.. ఆ ఫ్రాంచైజీని వీడనున్నట్లు తెలుస్తోంది. […]
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్ములేపాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల జాబితాలో మూడు స్థానాలు ఎగబాకి.. ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. పంత్ ఖాతాలో ప్రస్తుతం 745 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ 20, 99 పరుగులు చేశాడు.టెస్టు ర్యాంకింగ్స్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పంత్ అధిగమించాడు. ఒక స్థానం కిందకి పడిపోయిన విరాట్ (720).. […]
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ నేతృత్వంలోని భారత్-ఏ టీమ్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బీలో భాగంగా బుధవారం అల్ అమెరత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్-ఏ జట్టును భారత్ ఢీకొంటుంది. […]
సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టుకు బెంగళూరులో ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 46కే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో పోరాడినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉన్న భారత్.. పూణేలో పోరుకు సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచే రెండో టెస్టు ఆరంభం కానుంది. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత భారత్‌లో సాధించిన విజయం కివీస్ విశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన విశ్వాసంతో ఉన్న కివీస్.. భారత్‌లో […]
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న రాజాసాబ్‌లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ది రాజాసాబ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్ పోస్టర్లో డార్లింగ్ ప్రభాస్ స్టైలిష్ […]
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. దీపావళి పండగ వేళ ప్లాట్‌ఫామ్ ఫీజును జొమాటో పెంచింది. ఇక నుంచి ప్రతి ఆర్డర్‌పై రూ.10 వసూలు చేయనుంది. ఇంతకుముందు ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.7గా ఉంది. పండుగ రద్దీ సమయంలో సేవలను విజయవంతంగా కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జొమాటో తన యాప్‌లో పేర్కొంది. పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజుతో కస్టమర్లు కంగుతింటున్నారు. జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. జొమాటో […]
బెంగళూరులో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో బాగా ఆడారు. కానీ సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఒక్కడే దారుణంగా విఫలమయి.. జట్టులో తన స్థానాన్ని ప్రమాదంలో నెట్టేసుకున్నాడు. రాహుల్ జట్టులో ఎందుకు అంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేయడంతో రాహుల్‌కు రెండో టెస్టుల్లో అవకాశం కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ […]