గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దాంతో గోల్డ్ ధర 80 వేల మార్క్ దాటేసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400 పెరిగి.. రూ.73,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.430 పెరిగి.. రూ.80,070గా కొనసాగుతోంది. గోల్డ్ ధర 80 వేలు దాటడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
బంగారం ధర 80 వేలు మార్క్ దాటేయగా.. సిల్వర్ కూడా అదే బాటలో దూసుకుపోతోంది. ప్రస్తుతం లక్ష మార్క్ దాటేసి.. పరుగులు పెడుతోంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రెండు వేలు పెరిగి.. లక్షా నాలుగు వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి లక్షా పన్నెండు వేలుగా నమోదైంది. బెంగళూరులో మాత్రం 99 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,400
విజయవాడ – రూ.73,400
ఢిల్లీ – రూ.73,550
చెన్నై – రూ.73,400
బెంగళూరు – రూ.73,400
ముంబై – రూ.73,400
కోల్‌కతా – రూ.73,400
కేరళ – రూ.73,400
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.80,070
విజయవాడ – రూ.80,070
ఢిల్లీ – రూ.80,220
చెన్నై – రూ.80,070
బెంగళూరు – రూ.80,070
ముంబై – రూ.80,070
కోల్‌కతా – రూ.80,070
కేరళ – రూ.80,070
Also Read: IND vs AUS Test Series: నితీశ్ రెడ్డికి జాక్‌పాట్.. ఏకంగా టెస్టుల్లోకి ఎంట్రీ!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,12,000
విజయవాడ – రూ.1,12,000
ఢిల్లీ – రూ.1,04,000
ముంబై – రూ.1,04,000
చెన్నై – రూ.1,12,000
కోల్‌కతా – రూ.1,04,000
బెంగళూరు – రూ.99,000
కేరళ – రూ.1,12,000