న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సిరీస్‌లో 1-0తో వెనుకంజలో నిలిచిన టీమిండియా.. పూణే టెస్టులో గెలవాలని చూస్తోంది. గురువారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. బెంగళూరు టెస్ట్ పరాజయం నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాదీ పేసర్, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. […]
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో తాను ఆడాల్సిందని, చివరి నిమిషంలో తుది జట్టు నుంచి తనను తప్పించారని టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తెలిపాడు. తుది జట్టు నుంచి తప్పించినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ తనకు క్షమాపణలు చెప్పాడన్నాడు. తుది జట్టులో లేకపోవడంతో తాను కాస్త నిరాశకు గురయ్యానని, కానీ ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నో ఎదుర్కొన్నానని సంజూ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన సంజూ.. ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. రిషబ్ పంత్ జట్టులో […]
గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి 9 గేమ్స్‌ను తొలగించారు. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రెజ్లింగ్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్‌ను తొలగించారు. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ఓ ప్రకటన విడుదల చేసింది. ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఈసారి 10 గేమ్స్‌ను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. గ్లాస్గోలోని నాలుగు వేదికలు మాత్రమే ఆటలకు ఆతిథ్యం ఇస్తాయి. కామన్వెల్త్ క్రీడలు నాలుగేళ్లకొసారి జరుగుతాయన్న విషయం తెలిసిందే. 2026లో స్కాట్లాండ్లోని […]
దీపావళి పండగ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను తీసుకొచ్చింది. ‘బిగ్ దీపావళి సేల్’ 2024 సేల్‌ను ఇటీవలే ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి ఈ సేల్ ఆరంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్లలో ‘గూగుల్ పిక్సెల్’ స్మార్ట్‌ఫోన్స్ అయితే సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు బ్యాంకు ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ అదనం. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ […]
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన అతడు.. తాజాగా రంజీ ట్రోఫీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. ముంబై రంజీ టీమ్‌లోకి పృథ్వీ షాను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో అఖిల్ హెర్వాడ్కర్ రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. పృథ్వీ షా పక్కనపెట్టడానికి ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పష్టమైన కారణం చెప్పలేదు కానీ.. ఫామ్, ఫిట్నెస్, క్రమశిక్షణారాహిత్యం కారణంగానే వేటు వేసినట్లు తెలుస్తోంది. పృథ్వీ షా ఫామ్ […]
దేశంలో బంగారం పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడు రోజుల్లో తులం పసిడి రెండు వేలకు పైగా పెరిగింది. దాంతో పుత్తడి ధర 80 వేలకు చేరువైంది. నేడు 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10.. 22 కారెట్లపై రూ.10 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళావారం (అక్టోబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,010గా ఉండగా.. 24 క్యారెట్ల ధర […]
2025లో ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ నవంబర్ చివరలో మెగా వేలం నిర్వహిచే అవకాశాలు ఉన్నాయి. మెగా ఆక్షన్‌కు సంబందించిన రిటెన్షన్ పాలసీని ఇటీవల బీసీసీఐ విడుదల చేసింది. గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఓ ప్రాంచైజీ అట్టిపెట్టుకోవచ్చు. అక్టోబర్ 31 లోగా అన్ని ఫ్రాంఛైజీలు రిటైన్ లిస్టు సమర్పించాల్సి ఉంటుంది. క్రికెట్ అభిమానులంతా ఈ లిస్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్. ఇందుకు కారణం.. టీమిండియా […]
టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో సత్తాచాటిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ (150)తో జట్టును ఘోర పరాభవం నుంచి తప్పించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెన్సేషన్ అయ్యాడు. ఎటాకింగ్ ఆటతో ఆకట్టుకున్న సర్ఫరాజ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అదే సమయంలో బీసీసీఐపై సెటైర్స్ వేశాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల […]
బెంగళూరులో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి.. జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో టెస్టుకు సైతం దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఉదయం ఓ ప్రకటలో తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా పూణేలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కేన్ అందుబాటులో ఉండడు అని పేర్కొంది. గాయం కారణంగా కేన్ మామ బెంగళూరు టెస్ట్ ఆడని విషయం తెలిసిందే. […]
ఇటీవల టెస్టుల్లో శ్రీలంక చేతిలో దారుణ ఓటములను ఎదుర్కొని భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో సంచలన ప్రదర్శనతో సొంతగడ్డపై వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాకు షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ దిశగా దూసుకెళ్తున్న భారత జట్టుకు ఈ ఓటమి మింగుడుపడం లేదు. పూణే టెస్టులో గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది. ఇందుకోసం జట్టులో మార్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మార్పులు అనివార్యంగా […]