WhatsApp New Feature: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్!
- వాట్సప్‌లో కొత్త ఫీచర్
- లింక్డ్ డివైజెస్‌లో కాంటాక్ట్‌ని సేవ్ చేసుకోవచ్చు
- మొబైల్ మార్చినా కాంటాక్ట్‌లు అలానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు జోడిస్తోంది. యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరికొన్ని ఫీచర్లను జోడించేందుకు సిద్ధమైంది. మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకపోయినా ఓ వ్యక్తికి మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిన వాట్సప్.. కాంటాక్ట్ సేవ్ చేయడంలో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. లింక్డ్ డివైజెస్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేసుకునేలా ఓ ఫీచర్‌ను తెస్తోంది.
వాట్సప్‌లోని చాట్‌లో పేరుతో కనిపించాలంటే.. ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేయాల్సి ఉంటుంది. లింక్డ్ డివైజెస్‌లో సేవ్ చేసే ఆప్షన్ ఉండదు. చాలామంది యూజర్లు వాట్సప్‌ని ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లలో ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు కాంటాక్ట్ నేమ్ యాడ్ చేయడానికి కచ్చితంగా ప్రైమరీ డివైజ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ.. లింక్డ్ డివైజెస్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేసేలా ఓ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సప్ సిద్ధమైంది. ఇప్పటికే కసరత్తులు కూడా మొదలుపెట్టింది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సప్ వెబ్, విండోస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
Also Read
Also Read: Prabhas Birthday: మళ్లీ మళ్లీ చేయాలనుకున్నాడు.. ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే?
మరో ఫీచర్‌ని కూడా తీసుకురావాలని వాట్సప్ చూస్తోంది. కాంటాక్ట్‌ని ప్రత్యేకంగా వాట్సప్‌లోనే సేవ్ చేసే సదుపాయాన్ని తేనుందట. కాంటాక్ట్ సేవ్ చేసే సమయంలో కేవలం వాట్సప్‌లో యాడ్ చేయాలా? లేదా మొబైల్‌లో సైతం యాడ్ చేయాలా? అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయట. మనకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. దాంతో ఒకవేళ ఫోన్ పోయినా లేదా మొబైల్ మార్చినా.. వాట్సప్‌లోని కాంటాక్ట్‌లు అలాగే ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!