Chain Snatching: దారుణం.. చైన్ కోసం మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దొంగలు! (వీడియో)
- తమిళనాడులోని మధురైలో దారుణం
- చైన్ కోసం మహిళను ఈడ్చుకెళ్లిన దొంగలు
- వెన్నులో వణుకు పుట్టించే వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న లేదా ఆగిఉన్న మహిళల నుంచి బంగారు గొలుసును అందరూ చూస్తుండగానే ఎత్తుకెళుతున్నారు. దుండగులు చైన్ స్నాచింగ్ చేసే క్రమంలో మహిళలను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరగగా.. తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని మధురైలో చైన్ స్నాచర్లు ఓ మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు.
వివరాల ప్రకారం… మంజుల, ద్వారక్‌నాథ్ దంపతులు మధురైలోని పంథాడిలో నివాసం ఉంటారు. దీపావళి పండగ నేపథ్యంలో ఆదివారం మట్టుతావనికి షాపింగ్ కోసం వెళ్లారు. షాపింగ్ ముగించుకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. అప్పటికే మంజుల మెడలో బంగారాన్ని చూసిన ఇద్దరు దొంగలు.. ఆమెను వెంబడించారు. ఇంటిముందు ద్వారక్‌నాథ్ బైక్ ఆపగా.. మంజుల దిగేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వెనకాల ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒకడు.. మంజుల మెడలోని చైన్ లాగాడు. దాంతో ద్వారక్‌నాథ్ కిందపడిపోయాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: WhatsApp New Feature: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్!
కిందపడిపోయిన మంజుల మెడలోని చైన్ తెగలేదు. అయినా దొంగలు ఆమెను వదల్లేదు. ద్విచక్ర వాహనంపై ఉన్న దొంగలు.. మంజులను అలాగే కొంత దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో గొలుసు తెగిపోయి రెండు భాగాలైంది. ఒక భాగం బాధితురాలి వద్దే ఉండిపోయింది. కిందపడిన ద్వారక్‌నాథ్ లేచేసరికి చైన్ స్నాచర్లు అక్కడి నుంచి పరారయ్యారు. చైన్ స్నాచింగ్‌కి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై మంజుల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
At Madurai 😨
CAUGHT ON CAMERA: Woman Dragged On Street In A Chain-Snatching Attempt in Madurai. #ViralVideo #Madurai #Video #ChainSnatching #BiggBoss8Tamil #BiggBossTamil8
— Jaasers (@Jaasershahul) October 23, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..