గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగారం ధర 80 వేల మార్క్ దాటేయగా.. సిల్వర్ లక్ష దాటేసింది. అయితే గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్‌కు కాస్త బ్రేక్ పడింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (అక్టోబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,850గా నమోదవగా.. 22 క్యారెట్ల ధర రూ.79,470గా నమోదైంది.
మరోవైపు వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధర కూడా దిగొచ్చింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రెండు వేలు తగ్గి.. ఒక లక్ష రెండు వేలుగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ఒక లక్ష పది వేలుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,850
విజయవాడ – రూ.72,850
ఢిల్లీ – రూ.73,000
చెన్నై – రూ.72,850
బెంగళూరు – రూ.72,850
ముంబై – రూ.72,850
కోల్‌కతా – రూ.72,850
కేరళ – రూ.72,850
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,470
విజయవాడ – రూ.79,470
ఢిల్లీ – రూ.79,620
చెన్నై – రూ.79,470
బెంగళూరు – రూ.79,470
ముంబై – రూ.79,470
కోల్‌కతా – రూ.79,470
కేరళ – రూ.79,470
Also Read: IND vs AUS: పక్కనపెట్టేందుకు కారణం ఏదీ లేదు.. సర్ఫరాజ్ తుది జట్టులో ఉండాల్సిందే!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,10,000
విజయవాడ – రూ.1,10,000
ఢిల్లీ – రూ.1,02,000
ముంబై – రూ.1,02,000
చెన్నై – రూ.1,10,000
కోల్‌కతా – రూ.1,02,000
బెంగళూరు – రూ.1,01,000
కేరళ – రూ.1,10,000