పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో రెండో టెస్ట్ ఆడుతున్నట్లు కివీస్ కెప్టెన్ చెప్పాడు. గాయంతో మాట్ హెన్రీ దూరం కాగా.. మిచెల్ సాంట్నర్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
అందరూ అనుకున్నట్లే కేఎల్ రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించారు. స్థానంలో శుభమాన్ గిల్ జట్టులోకి వచ్చాడు. బెంగళూరులో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. స్వదేశంలో విఫలమవుతున్న మహ్మద్ సిరాజ్‌పై వేటు పడింది. అతడి స్థానములో ఆకాశ్ డీప్ ఆడుతున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ ఓ టెస్టు ఓడి 0-1తో వెనకబడి ఉంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని రోహిత్ సేన్ చూస్తోంది.
Also Read: IPL Retention 2025: ఢిల్లీ క్యాపిటల్స్ షాకింగ్ నిర్ణయం.. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్
తుది జట్లు:
భారత్: జైస్వాల్, రోహిత్, గిల్, కోహ్లీ, పంత్, సర్ఫరాజ్, జడేజా, సుందర్, అశ్విన్, బుమ్రా, ఆకాశ్.
న్యూజిలాండ్: లాథమ్, కాన్వే, యంగ్, రవీంద్ర, మిచెల్, బ్లండెల్, ఫిలిప్స్, శాంట్నర్, సౌథీ, ఒరోర్క్, అజాజ్.