అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్ములేపాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల జాబితాలో మూడు స్థానాలు ఎగబాకి.. ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. పంత్ ఖాతాలో ప్రస్తుతం 745 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ 20, 99 పరుగులు చేశాడు.టెస్టు ర్యాంకింగ్స్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పంత్ అధిగమించాడు. ఒక స్థానం కిందకి పడిపోయిన విరాట్ (720).. ఎనిమిదో ర్యాంకు సాధించాడు.
భారత్ vs న్యూజిలాండ్, పాకిస్థాన్ vs ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌లు ముగియడంతో ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. బ్యాటర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (917) అగ్ర స్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ (821), హ్యారీ బ్రూక్ (803) టాప్ 3లో ఉన్నారు. 780 పాయింట్లతో యశస్వి జైస్వాల్ నాలుగో స్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్ నుంచి టాప్ 10లో యశస్వి, విరాట్ మాత్రమే ఉన్నారు.
Also Read: Team India: ఆసియా కప్‌లో టీమిండియా వరుస విజయాలు.. సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో ఢీ!
టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. జస్ప్రీత్ బుమ్రా (871), రవిచంద్రన్ అశ్విన్ (849), జోష్ హేజిల్‌వుడ్ (847) టాప్-3లో ఉన్నారు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండు ర్యాంక్‌లు ఎగబాకి.. 9వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా (442), ఆర్ అశ్విన్ (335), షకీబ్ అల్ హసన్ (285) టాప్-3లో ఉన్నారు.