బాబాయ్-అబ్బాయ్ బ్యాక్ టు బ్యాక్ థియేటర్లోకి రాబోతున్నారా? అంటే.. అవుననే మాట వినిపిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఇప్పటికే జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ మాస్ లుక్ కేక పెట్టించేలా ఉంది. దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పెద్ది సినిమాను 2026 మార్చి 27న రిలీజ్ చేయబోతున్నారు.
అయితే పెద్ది వచ్చిన కొన్ని వారాల గ్యాప్‌లోనే ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ ప్లానింగ్‌లో ఉన్నాడు డైరెక్టర్ హరీష్. మరో రెండు వారాలు షూటింగ్ చేస్తే మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: RK Beach: ఆశ్చర్యానికి గురిచేసిన ఆర్కే బీచ్.. వెలుగులోకి బ్రిటీష్ కాలంనాటి బంకర్!
ఇప్పటికే 2026 సమ్మర్ సీజన్‌లో పెద్ది ఉండడంతో.. ఉస్తాద్ భగత్ సింగ్‌ను నాలుగైదు వారాల గ్యాప్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఏప్రిల్ లేదా మే నెలలో ఉస్తాద్ థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మెగాస్టార్ నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా కూడా సమ్మర్‌కే షెడ్యూల్ చేయబడింది. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. కాబట్టి వచ్చే సమ్మర్‌లో మెగా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్, విశ్వంభర విడుదల తేదీలపై క్లారిటీ రానుంది.