Australian Open 2025: క్వార్టర్‌ఫైనల్‌కు సినర్.. ఎదురులేని స్వైటెక్!
- ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు సినర్
- ప్రిక్వార్టర్స్ దాటిన స్వైటెక్
- క్వార్టర్స్‌లో అల్కరాస్‌తో జకోవిచ్ ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాప్ సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్లో 6-3, 3-6, 6-2, 6-2తో 13వ సీడ్ రూన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. యువ ఆటగాళ్లు ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. మూడో సెట్లో ఓ ర్యాలీ 37 షాట్ల పాటు సాగిందంటే అర్ధం చేసుకోవచ్చు. వేడి, ఉక్కపోత పరిస్థితుల మధ్య గాయంతో ఇబ్బందిపడుతూనే సినర్ మ్యాచ్ నెగ్గాడు. ఇక క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా)ను టైటిల్ ఫేవరెట్ సినర్ ఢీకొంటాడు. ఈరోజు జరిగే క్వార్టర్స్‌లో అల్కరాస్‌ను జకోవిచ్.. టామీ పాల్‌తో జ్వెరెవ్ తలపడతాడు.
మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్ రిబకినా (కజకిస్థాన్) ఓడిపోయింది. ప్రిక్వార్టర్స్‌లో 3-6, 6-1, 3-6తో మాడిసన్ కీస్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో స్వైటెక్ (పోలెండ్) దూసుకుపోతోంది. నాలుగో రౌండ్లో స్వైటెక్ 6-0, 6-1తో ఎవాలిస్ (జర్మనీ)ని చిత్తు చేసింది. ఎనిమిదో సీడ్ నవారో (అమెరికా), స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. నవారో 6-4, 5-7, 7-5తో కసట్కినా (రష్యా)పై.. స్వితోలినా 6-4, 6-1తో కుద్రెమెతోవా (రష్యా)పై విజయం సాధించారు.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!