Davos Tour: అనకాపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్‌కు అంగీకారం: సీఎం చంద్రబాబు
- దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు
- లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు భేటీ
- అనకాపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్‌కు అంగీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచదేశాల ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన సమావేశంలో తాము పాల్గొన్నాం అని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు.
‘అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్లాంట్ అతిపెద్ద ప్రాజెక్టు. ఇటీవల అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది. లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్నాం. 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్‌కు అంగీకారం తెలిపారు’ అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఓ ఫొటో జత చేసి.. ఇన్వెస్ట్ ఇన్ ఏపీ అని హ్యాష్ టాగ్ పెట్టారు. ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్ ఏర్పాటు ప్రక్రియను ఏపీలో ప్రారంభించామని లక్ష్మీ మిట్టల్ గుర్తు చేశారు. అనకాపల్లి సమీపంలో 2 దశల్లో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read
Met with the Executive Chairman of @AMNSIndia, Mr. Lakshmi N. Mittal, and CEO Mr. Aditya Mittal, in Davos today. ArcelorMittal/Nippon Steel has recently made a landmark investment of ₹1.4 lakh crore for a 17.8-million-ton integrated steel project in Anakapalli. This initiative… pic.twitter.com/wjS6fEga2u
— N Chandrababu Naidu (@ncbn) January 21, 2025
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!