‘ఆచార్య దేవోభవ’.. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు కట్టబెట్టింది మన దేశం. అయితే ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెస్తున్నారు. కీచకోపాధ్యాయులకు దేహశుద్ధి చేసినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో లక్ష్మన్న ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. […]
మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోళ్లదిన్నెకు చెందిన టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్.. కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు. ఆయనపై 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింద […]
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లో మూడో రోజు పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మూడవ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధినేతలతో సీఎం సమావేశం కానున్నారు. బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ ఇవాళ సీఎం చర్చలు జరపనున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో రాష్ట్ర ప్రభుత్వం […]
మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థుల మృతి: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం కర్ణాటకలోని సింధునూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం […]
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం కర్ణాటకలోని సింధునూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు (14 […]
వరల్డ్ ఎకనమిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌తో ఏపీ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ కాంగ్రెస్ సెంటర్లో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతతో అనుసంధానించి గ్లోబల్ స్టాండర్ట్స్ తో అందరికీ ఆరోగ్యం అందించడంపై సహకారం కావాలన్నారు లోకేష్. పోషకాహారం, సంరక్షణ కల్పించాలన్నది తమ లక్ష్యం అని.. హెల్త్ కేర్ డెలివరీలో ప్రపంచ ప్రమాణాలను సాధించడం, అన్ని […]
ఇవాళ మూడోరోజు దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దావోస్‌కు వెళ్లారు. సౌత్ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన జవాన్ కార్తీక్ పార్దీవదేహం నేడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎగువ రాగిమానుపెంటకు చేరుకోనుంది. నేడు రాజమండ్రిలో జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ ర్యాలీ జరగనుంది. జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ వివాదంతో అఖిల భారత కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు […]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడింది సీఎం చంద్రబాబు నాయుడు అని మంత్రి కొల్లు రవీంద్ర పేరొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ చాలా ఉపయోగం అని, కూటమి ప్రభుత్వ చిత్త శుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. వైసీపీ పాలన భూదోపిడీ కోసం జరిగిందని ఎద్దేవా చేశారు. దేశంలో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందుఉంటుందని, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతాయని, పోలవరం నుంచి బాహుదా వరకు అన్ని ప్రాజెక్టులు పరుగు […]
రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ బిగించటం లేదని చాలాసార్లు చెప్పామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారని, ఇందులో నిజం లేదన్నారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబును చూసి […]
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్) వార్షిక సదస్సు 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల నాయకులు, అధికారులు, వ్యాపార వేత్తలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. దావోస్‌లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజూ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల […]