గత కొన్ని రోజులుగా బంగారం ధరలు బ్రేకుల్లేకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.81 వేల మార్క్ దాటింది. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జనవరి 21) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.74,500గా.. 24 క్యారెట్ల ధర రూ.81,230గా ఉంది. గతేడాది కేంద్ర బడ్జెట్ అనంతరం భారీగా తగ్గిన పసిడి రేట్లు.. ఇప్పుడు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి.
మరోవైపు వరుసగా మూడు రోజులు భారీగా పెరిగిన వెండి ధర.. స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష నాలుగు వేలుగా కొనసాగుతోంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.96,500గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.74,500
విజయవాడ – రూ.74,500
ఢిల్లీ – రూ.74,650
చెన్నై – రూ.74,500
బెంగళూరు – రూ.74,500
ముంబై – రూ.74,500
కోల్‌కతా – రూ.74,500
కేరళ – రూ.74,500
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.81,230
విజయవాడ – రూ.81,230
ఢిల్లీ – రూ.81,380
చెన్నై – రూ.81,230
బెంగళూరు – రూ.81,230
ముంబై – రూ.81,230
కోల్‌కతా – రూ.81,230
కేరళ – రూ.81,230
Also Read: Balakrishna: జర్నలిస్టులకు త్వరలో సొంతింటి కల నెరవేరుతుంది!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,04,000
విజయవాడ – రూ.1,04,000
ఢిల్లీ – రూ.96,500
ముంబై – రూ.96,500
చెన్నై – రూ.1,04,000
కోల్‌కతా – రూ.96,500
బెంగళూరు – రూ.96,500
కేరళ – రూ.1,04,000