కార్తీకమాసం సందర్భంగా భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో 2025 ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. విశేష పూజలు, అనుగ్రహ భాషణం, కళ్యాణం, ప్రవచనాలు, వాహన సేవలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. నవంబర్ 1న ప్రారంభమైన కోటి దీపోత్సవం.. విజవంతంగా కొనసాగుతూ భక్తుల మన్ననలు అందుకుంటోంది. కోటి దీపోత్సవంలో నేడు 10వ రోజు. నేటి విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.
Also Read: Kranti Gaud: కూతురుకు ప్రపంచకప్.. తండ్రికి పోలీస్ ఉద్యోగం!
మూడవ కార్తీక సోమవారం సందర్భంగా కోటి దీపోత్సవం 2025లో విశేష కార్యక్రమాలు ఉన్నాయి. పూజ్యశ్రీ జయేంద్రపురి మహాస్వామీజీ (శ్రీ కైలాష్ ఆశ్రమం, బెంగళూరు) గారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. బ్రహ్మశ్రీ పశర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై ద్వాదశ జ్యోతిర్లింగ మహాపూజ, ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మహారతి పూజ ఉంటుంది. భక్తులచే శివలింగాలకు కోటి రుద్రాక్షల అర్చన జరిపించనున్నారు. కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం జరగనుంది. చివరగా నంది వాహన సేవ ఉంటుంది. కోటి దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులు కోరారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 5.30కు ఆరంభం అవుతుంది. భక్తులకు కావాల్సిన పూజా సామాగ్రి అన్ని కూడా భక్తి టీవీ, ఎన్టీవీ యాజమాన్యం ఫ్రీగా సమకూర్చుతుంది.
