Fastest Fifty: 6,6,6,6,6,6,6,6.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ, వరల్డ్ రికార్డు!
- ఆకాష్ కుమార్ చౌదరి వరల్డ్ రికార్డు
- ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ
- ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు, వరుసగా 8 సిక్స్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. సూరత్‌లోని పితావాలా స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో ఆకాష్ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కూడా. ఈ క్రమంలో వేన్ వైట్ రికార్డును ఆకాష్ బద్దలు కొట్టాడు.
2012లో ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ తరఫున ఆడిన వేన్ వైట్ 12 బంతుల్లోనే అర్ధ సెంచరీని సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును ఆకాష్ కుమార్ చౌదరి బ్రేక్ చేశాడు. అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్‌లో ఆకాశ్ 14 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆకాశ్ వరుసగా ఎనిమిది సిక్స్‌లు కొట్టాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడం విశేషం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుసగా 8 సిక్స్‌లు బాదిన తొలి ప్లేయర్‌గా కూడా మరో రికార్డు సృష్టించాడు. ఆకాష్ 126వ ఓవర్‌లో లిమార్ డాబీ వేసిన ఆరు బంతుల్లోనూ సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న రెండు బంతుల్లో సిక్స్‌లు బాదాడు.
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో వరుసగా ఎనిమిది బంతుల్లో సిక్స్‌లు బాదిన మొదటి క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక ఆటగాడు ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టడం ఇది రెండోసారి. అంతకుముందు 1984-85లో తిలక్ రాజ్ బౌలింగ్‌లో రవిశాస్త్రి ఆరు సిక్సులు బాదాడు. మొత్తం మీద ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక బ్యాట్స్‌మన్ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టడం ఇది మూడోసారి. 25 ఏళ్ల ఆకాష్ ఇప్పటివరకు 31 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 28 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆల్ రౌండర్ అయిన ఆకాష్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మూడు హాఫ్ సెంచరీలతో 553 పరుగులు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో బంతితో రాణించి 87 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో 203 పరుగులు, 37 వికెట్లు సాధించాడు. టీ20లలో 107 పరుగులు, 28 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?