Chilkur Balaji Temple Priest: అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు!
- సీఎస్ రంగరాజన్‌పై దాడి కేసు
- రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
- దాడి కేసులో మొత్తం 22 మందిని నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌కి చెందిన నాగనపల్లి సాయన్న, ఖమ్మంకి చెందిన భూక్యా గోపాల్ రావు, భూక్యా శ్రీను, అంకోలు శిరీష, బేబి రాణిలు అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నెల 7న 20 మంది నిందితులు (మహిళలు, పురుషులు) సీఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామదండు కోసం మనుషులను రిక్రూట్ చేయాలని, అలానే ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అందుకు వ్యతిరేకించినందుకు మొహం, శరీరంపై దాడికి పాల్పడ్డారు. మణికొండ పంచవటి కాలనీలో ఈనెల 8న వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో చేసిన నేరాన్ని రాఘవ రెడ్డి ఒప్పుకున్నాడు. దాడికి ముందు ఏ2గా ఉన్న నిందితుడు సాయన్నను దమ్మాయిగూడలోని ఉదా రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కలుసుకున్నారు. రాఘవ రెడ్డి 2014లో ఆంధ్ర అసోసియేషన్ ఫర్ తెలంగాణ, ఆంద్ర పీపుల్ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. హిందూ ధర్మాన్ని కాపాడతానని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్ ను సిద్దం చేయాని భావించాడు. ఇందు కోసం ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానెళ్ళు ఏర్పాటు చేసి ప్రసంగాలు ఇచ్చి ప్రేరేపించాడు.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
రాఘవ రెడ్డి మణికొండలో నూతన న్యాయ చట్టాలపై అవగాహన కోసం సమావేశం ఏర్పాటు చేశాడు. 2022లో భార్యను చైర్మన్ గా పెట్టి కోసలేంద్ర ట్రస్ట్ ప్రారంభించాడు. దీని ద్వారా ఫండ్ కలెక్ట్ చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన శ్యామ్ అనే వ్యక్తి సాయంతో రామరాజ్యం వెబ్ సైట్ ను ప్రారంభించాడు. 10 నెలల క్రితం రాఘవ రెడ్డి ఓ యూట్యూబ్ ఫాలోవర్ ద్వారా జనవరి 25న రంగారాజన్ ను కలిశాడు. అతను చెప్పి ప్రతిపాదనకు రంగరాజన్ స్పందించలేదు. నిందితులు గత నెల 25న పెనుగొండలోని వాసవి కన్యాకాపరమేశ్వరి గుడిలో కలుసుకున్నారు. ఈ నెల 4న రాఘవ రెడ్డి స్నేహితుడు, న్యాయవాది అయిన దామోదర్ రెడ్డి సాయంతో దమ్మాయిగూడలో ఉదా రెడ్డి ఇంట్లో కలుసుకున్నారు. రంగరాజన్ ను మరోసారి కలిసి మాట్లాడాలని, వినకుంటే దాడి చేయాలని నిర్ణయించుకున్నారు.
Also Read: KTR: పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?
ఈ నెల 7న ఉదయం 8 గం సమయంలో రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రంగరాజన్ స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వత మాట్లాడతాను అని చెప్పినా వినకుండా దాడికి పాల్పడ్డారు. తాము చెప్పినట్లు వినకపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్తామని, పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెదిరించారు. దాడి చేసి వీడియోలను అప్లోడ్ చేశారు. కేసులో మొత్తం 22 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. మరో 16 మంది నిందితులు పరారీలో ఉన్నారు. వీర రాఘవ రెడ్డిపై గతంలో అబిడ్స్ లో లైంగిక వేధింపుల కేసు ఉంది.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!