KTR: పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?
- లోన్ కట్టలేదని గేటు పీక్కెళ్లిన బ్యాంక్ అధికారులు
- అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్
- మీ ప్రతాపాన్ని రుణమాఫీ చేయని సీఎంపై చూపించగలరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో గేదెల కోసం తీసుకున్న లోన్ కట్టలేదని డీసీసీబీ బ్యాంక్ అధికారులు ఇంటి గేటు పీక్కెళ్లిన విషయం తెలిసిందే. లోన్ చెల్లించలేదని రైతు ఇంటి గేటును ట్రాక్టర్ తీసుకొచ్చి మరి బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం కట్టలేదని ఇంత దారుణమా? అని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా? అని బ్యాంకు అధికారులను కేటీఆర్ నిలదీశారు.
Also Read: Ponnam Prabhakar: ఇది రీసర్వే కాదు.. ఇది మిస్ అయిన వారి కోసం మాత్రమే!
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
‘రుణం కట్టలేదని.. ఇంత దారుణమా?. నాటి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అప్పు కట్టలేదని ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి, రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి, కరెంట్ మోటర్లు అండ్ స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చింది. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా?. మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని.. మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా?. రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని.. రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిపై చూపించగలరా?. పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?. గుర్తుపెట్టుకోండి.. రైతులు అంతా గమనిస్తున్నారు. ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరు. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు. జై తెలంగాణ’ అని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!