చంద్రగిరిలో ఉప ఎన్నికలు: రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ , రెండు వైస్ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి రూరల్ (మం) ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. చంద్రగిరి (మం) రామిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ ఉమ, యర్రావారిపాళెం, చింతకుంట ఉప సర్పంచ్ రమేష్ నాయుడు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారం క్రితం తిరుపతి […]
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మూడో స్థానంలో దిగిన శ్రేయస్.. ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. ఈ క్రమంలో 17 ఓవర్ పూర్తయ్యేసరికి 90 పరుగులకు చేరుకున్నాడు. అప్పటికి ఇంకా 3 ఓవర్లు ఉండడంతో.. శ్రేయస్ సెంచరీ లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే తర్వాతి 2 ఓవర్లలో 3 బంతులే ఆడి 7 […]
సీజన్ తొలి మ్యాచులోనే 97 పరుగులతో నాటౌట్‌గా నిలవడం తమకు మరింత కలిసొచ్చే అంశం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. శశాంక్ సింగ్ అద్భుతంగా ఆడాడని, 16 బంతుల్లో 44 రన్స్ చేయడం జట్టుకు కీలకంగా మారాయన్నాడు. ఒత్తిడిలో కూడా విజయ్ కుమార్ వైశాక్ ప్రశాంతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. సీజన్ ప్రారంభానికి ముందే అన్ని విధాలుగా సిద్ధమయ్యామని, ఇదే జోరును మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాం అని శ్రేయస్ చెప్పాడు. ఐపీఎల్ 2025లో […]
బ్రిస్బేన్‌లోని ప్రతిష్టాత్మక గబ్బా క్రికెట్ స్టేడియం శిథిలావస్థకు చేరుకుందని క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది. 2032 ఒలింపిక్స్ అనంతరం గబ్బా స్టేడియాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం విక్టోరియా పార్క్ ప్రాంతంలో 63 వేల సామర్థ్యమున్న కొత్త స్టేడియంను నిర్మిస్తామని ప్రకటించిది. ఒలింపిక్స్ అనంతరం ఈ స్టేడియానికి క్రికెట్ తరలి వెళ్లనుంది. ఈ విషయాన్ని క్వీన్స్‌ల్యాండ్ ప్రిమియర్ డేవిడ్ క్రిసాఫుల్లి తాజాగా ప్రకటించాడు. 2032 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న క్వీన్స్‌ల్యాండ్ […]
ఐపీఎల్ 2024లో ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. 10 మ్యాచులలో 52 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు మ్యాక్సీని బెంగళూరు వదిలేయగా.. పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. గతంలో పంజాబ్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్‌పై ఆ ప్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్ ఆడిన మ్యాక్స్‌వెల్.. గోల్డెన్ డక్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిశోర్ […]
అశుతోష్ శర్మ చేతి వేలు కట్ అయినా మ్యాచ్ ఆడాడు అని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ తెలిపారు. గాయం అయినా మ్యాచ్‌ను తనదైన స్టైల్లో ముగించాడని ప్రశంసించారు. ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒక వికెట్ తేడాతో గెలిచింది. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకున్న ఢిల్లీని అశుతోష్ మెరుపు హాఫ్ […]
ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్లో గుజరాత్, పంజాబ్ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. గుజరాత్‌కు శుభ్‌మాన్ గిల్, పంజాబ్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు. తుది జట్లు ఇవే: పంజాబ్: ప్రభ్సిమ్రాన్ సింగ్ […]
మలయాళీ యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుత్తూర్ తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన విఘ్నేశ్.. చెన్నై సూపర్ కింగ్స్‌పై సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు ఇచ్చి.. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్‌తో పాటు హిట్టర్లు శివమ్ దూబే, దీపక్ హూడాను ఔట్ చేసి ఔరా అనిపించాడు. ఈ 24 ఏళ్ల లెగ్ స్పిన్నర్ దిగ్గజం ఎంఎస్ ధోనీని కూడా […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన కొత్తలో తనకు అస్సలు నచ్చలేదని, అవసరం లేదనిపించిందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపారు. ఆటలో పాలుపంచుకోవడం తనకు ఇష్టం అని, ఇప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అవసరం లేదన్నారు. ఇంపాక్ట్ రూల్ వల్ల మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని చాలా మంది అనడంలో నిజం లేదని, ఆటగాళ్ల మైండ్ సెట్ మారడంతోనే పెద్ద స్కోర్స్ సాధ్యమవుతున్నాయని ధోనీ చెప్పుకొచ్చారు. […]
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిలు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. సోమవారం అతియా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాహుల్, అతియాలు తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రాహుల్, అతియా దంపతులకు క్రికెటర్స్, సెలబ్రిటీస్, ఫాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్లేయర్స్ ప్రత్యేక విషెష్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ […]