గురువారం ఉదయం 10 గంటలకి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు డీలిమిటేషన్‌పై ప్రభుత్వ తీర్మానంను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ తీర్మానం అనంతరం సభలో ద్రవ్య వినిమయ బిల్లు, అవయవ దానం బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 12వ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలతో […]
ఐపీఎల్ 18వ సీజన్లో నేడు మరో ఆసక్తికర పోరు జరుగనుంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ ఫుల్ జోష్‌లో ఉంది. మరోసారి భారీ స్కోరుతో విరుచుకుపడాలని భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో.. ఐపీఎల్ 2025లో బోణీ కొట్టాలని చూస్తోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తరం పోరు ఖాయంగా కనిపిస్తోంది. సన్‌రైజర్స్ […]
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. గతేడాది ఆర్సీబీ తరుపున చెత్త ప్రదర్శన చేసిన మ్యాక్సీని ఆ జట్టు వేలంలోకి వదిలేసింది. దీంతో రూ.11 కోట్ల ధర నుంచి రూ.4 కోట్లకు పడిపోయాడు. ఐపీఎల్ 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని 4 కోట్లకే దక్కించుకుంది. అయితే ఈ సీజన్లోనూ మాక్స్వెల్ ప్రదర్శనలో మార్పు లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో ఐపీఎల్లో అత్యధిక సార్లు (19) […]
ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు గౌహతి వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో దారుణ ఓటమి ఎదుర్కొన్న కేకేఆర్.. ఆర్ఆర్పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. మరోవైపు హైదరాబాద్ చేతిలో 44 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడింది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కోల్‌కతా, రాజస్థాన్ జట్ల […]
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ (97) మిస్ అయింది. మూడో స్థానంలో దిగిన శ్రేయస్.. ఫోర్లు, సిక్సులతో చెలరేగి 17 ఓవర్ పూర్తయ్యేసరికే 90 రన్స్ చేశాడు. అప్పటికి ఇంకా 3 ఓవర్లు ఉండడంతో శ్రేయస్ సెంచరీ లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే చివరి 3 ఓవర్లలో 4 బంతులను మాత్రమే ఆడాడు. శశాంక్ సింగ్ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోవడంతో.. శ్రేయస్ సెంచరీకి […]
మాజీ ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్‌కు కోర్టు, బయట సవాళ్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. రోలాండ్ గారోస్‌లో అద్భుత విజయం తర్వాత.. నిషేధిత పదార్థం తీసుకోవడంతో ఓ నెల సస్పెన్షన్ కారణంగా ప్రత్యర్థి అరినా సబలెంకాకు అగ్రస్థానాన్ని కోల్పోయింది. అప్పుడు స్వైటెక్ కెరీర్ ప్రమాదంలో పడింది. స్వైటెక్ తన స్థానాన్ని తిరిగి పొందడానికి పోరాడుతున్న సమయంలో మయామి ఓపెన్‌లో ఆమె కొత్త వివాదంలో చిక్కుకుంది. మయామి ఓపెన్ ప్రాక్టీస్‌లో ఉన్న సమయంలో ఓ ప్రేక్షకుడు ఇగా […]
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.58 కోట్లను నజరానా ప్రకటించింది. భారత ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్‌కు రూ.3 కోట్ల ప్రైజ్‌మనీ చొప్పున దక్కనుంది. అలానే సహాయక కోచింగ్ సిబ్బందికి రూ.50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున దక్కనుంది. అయితే టీ20 ప్రపంచకప్ 2024 గెలిచినప్పుడు అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన ప్రైజ్‌మనీని వెనక్కి ఇచ్చి.. సహచరులకు సమంగా […]
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్ అంపైర్స్ జాబితా రిలీజ్ అయింది. 2025-26 సీజన్‌కు 12 మందితో కూడిన ఎలైట్ అంపైర్ల ప్యానెల్ జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. భారత్‌కు చెందిన నితిన్ మేనన్ తన స్థానాన్ని నిలుపుకున్నారు. జోల్ విల్సన్ (ట్రినిడాడ్), మైకెల్ గాఫ్ (ఇంగ్లండ్)లకు ప్యానెల్లో చోటు దక్కలేదు. ఈ ఇద్దరి స్థానాల్లో అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్), అలాహుద్దీన్ పాలేకర్ (దక్షిణాఫ్రికా)లకు ఐసీసీ చోటు కల్పించింది. మరోవైపు భారత్‌కు చెందిన జయరామన్ మదన్‌గోపాల్‌కు […]
గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే గత 4-5 రోజలుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్.. నేడు మరలా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరగగా.. 22 క్యారెట్లపై రూ.100 పెరిగింది. బుధవారం (మార్చి 26) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400గా.. 22 క్యారెట్ల ధర రూ.81,950గా […]
ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్ ఐపీఎల్లో కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి.. 10 మ్యాచులలో 52 పరుగులు మాత్రమే చేశాడు. గతేడాది తీవ్రంగా నిరాశపర్చిన మ్యాక్సీని ఆర్సీబీ వేలంలోకి వదిలేయగా.. పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. సీజన్, ఫ్రాంచైజీ మారినా మ్యాక్స్‌వెల్ ప్రదర్శనలో మాత్రం మార్పు లేదు. ఐపీఎల్ 2025లో మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గుజరాత్ […]