MS Dhoni: కొత్తలో ఆ రూల్ నచ్చలేదు.. ఇప్పటికీ నాకు అవసరం లేదు!
- ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదనిపించింది
- ఇంపాక్ట్ రూల్ నాకు అవసరం లేదు
- ఆటలో పాలుపంచుకోవడమీ నాకు ఇష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన కొత్తలో తనకు అస్సలు నచ్చలేదని, అవసరం లేదనిపించిందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపారు. ఆటలో పాలుపంచుకోవడం తనకు ఇష్టం అని, ఇప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అవసరం లేదన్నారు. ఇంపాక్ట్ రూల్ వల్ల మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని చాలా మంది అనడంలో నిజం లేదని, ఆటగాళ్ల మైండ్ సెట్ మారడంతోనే పెద్ద స్కోర్స్ సాధ్యమవుతున్నాయని ధోనీ చెప్పుకొచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని ఐపీఎల్ 2023లో ప్రవేశపెట్టారు. ఈ రూల్ వల్ల అదనంగా ఒక బ్యాటర్ లేదా బౌలర్‌ను ఆడించే అవకాశం ఉంటుంది.
‘జియోస్టార్’తో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ… ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అమలు చేసిన కొత్తలో అవసరం లేదని నేను భావించాను. ఒక విధంగా ఈ రూల్ నాకు సహాయపడుతుంది. కానీ నాకు దాని అవసరం లేదు. నేను ఇప్పటికీ కీపింగ్ చేస్తాను కాబట్టి నేను ఇంపాక్ట్ ప్లేయర్‌ని కాదు. ఆటలో పాలుపంచుకోవడమీ నాకు ఇష్టం. ఇంపాక్ట్ రూల్ వల్ల భారీ స్కోర్లు నమోదవుతున్నాయని చాలా మంది అంటున్నారు. పిచ్ పరిస్థితులు,ప్లేయర్ల కాన్ఫిడెన్స్ కారణంగానే భారీ స్కోర్లు నమోదవుతున్నాయని నేను నమ్ముతున్నా. అదనపు బ్యాటర్ ఉన్నాడనే ధైర్యంతో ప్లేయర్స్ భయం లేకుండా, దూకుడుగా ఆడుతున్నారు. ఈ రూల్ ముందుగా వచ్చే ప్లేయర్ల ఆట తీరును మార్చేస్తోంది’ అని అన్నారు.
Also Read
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
Also Read: KL Rahul: కేఎల్ రాహుల్‌కు ప్రత్యేక విషెష్ చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. 43 ఏళ్ల వయసులోనూ కీపర్‌గా అదరగొడుతున్నారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను మెరుపు స్టంపింగ్ చేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యువ కీపర్ రిషబ్ పంత్ కూడా మహీ అంత వేగంగా క్రీజులో కదలలేకపోతున్నాడు. అంతేకాదు పంత్ తప్పిదం కారణంగా లక్నో మ్యాచ్ కూడా ఓడింది. దాంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక చెన్నై తర్వాతి మ్యాచ్‌లో మార్చి 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!