ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్లో గుజరాత్, పంజాబ్ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. గుజరాత్‌కు శుభ్‌మాన్ గిల్, పంజాబ్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు.
తుది జట్లు ఇవే:
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్గే, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్.
గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (కీపర్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాతియా, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.