Vipraj Nigam: నీ వీడియోను వైరల్ చేస్తా.. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు మహిళ బ్లాక్ మెయిల్!
- సమస్యలో చిక్కుకున్న భారత యువ క్రికెటర్
- ఢిల్లీ క్రికెటర్‌కు మహిళ బ్లాక్ మెయిల్
- విప్రజ్‌ను బ్లాక్‌మెయిలింగ్‌కు గురిచేస్తోన్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ ఓ సమస్యలో చిక్కుకున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న విప్రజ్‌ను ఓ మహిళ బ్లాక్‌మెయిలింగ్‌కు గురిచేస్తోంది. గత రెండు నెలలుగా సదరు మహిళ అనుచిత డిమాండ్లు చేస్తోందని, తాను అంగీకరించకపోతే ప్రైవేట్ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విప్రజ్ ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని కొత్వాలి నగర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నివేదికల ప్రకారం… విప్రజ్ నిగమ్‌కు 2025 సెప్టెంబర్‌లో బెదిరింపు, మెసేజులు రావడం ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో వేధింపులు ఒకే మొబైల్ నంబర్ నుంచి వచ్చాయి. విప్రజ్ ఆ నంబర్ బ్లాక్ చేసిన తర్వాత.. అనేక అంతర్జాతీయ నంబర్‌ల ద్వారా బెదిరింపులు కొనసాగాయి. తన డిమాండ్లను ఒప్పుకోకుంటే తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. కాల్స్‌లో విప్రజ్ సహా అతని కుటుంబాన్ని బహిరంగంగా అవమానిస్తామని హెచ్చరించింది. నకిలీ వీడియోలతో బెదిరింపులన్నీ తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేయడానికి, మానసికంగా కృంగదీయడానికే అని విప్రజ్ ఎఫ్‌ఐఆర్లో పేర్కొన్నాడు. కాల్ డేటా, మెసేజ్‌ల ద్వారా దర్యాప్తు చేసేందుకు సైబర్ సెల్ సాయం కూడా కొత్వాలి నగర్ పోలీసులు తీసుకుంటున్నారు. బెదిరింపు చేసేది ఇంతకీ అమ్మాయా? లేదా అబ్బాయా అని ఇంకా తెలియరాలేదు.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
Also Read: Harmanpreet Kaur: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే?
ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ విప్రజ్ నిగమ్‌ని రూ.50 లక్షలకు తీసుకుంది. 21 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ తన తొలి సీజన్‌లోనే బ్యాట్, బంతితో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్ లలో 142 పరుగులు, 11 వికెట్లు పడగొట్టాడు. అతను ఇప్పుడు ఇండియా A, దక్షిణాఫ్రికా A మధ్య ఈరోజు ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు. ఉత్తరప్రదేశ్ జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐదు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు, 116 పరుగులు చేశాడు. ఆరు లిస్ట్ A మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు, 35 పరుగులు కూడా చేశాడు. 21 టీ20 మ్యాచ్‌లలో 206 పరుగులు, 19 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు