ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం వచ్చే డిసెంబర్‌లో జరగనుంది. ఫ్రాంచైజీలు విడుదల చేయాలనుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15 లోపు సమర్పించాల్సి ఉంది. అయితే ఐపీఎల్ 2026 ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను నియమించింది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. ఇక కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి వాట్సన్ పనిచేయనున్నాడు.
ఐపీఎల్‌లో ఆటగాడిగా, కోచ్‌గా షేన్ వాట్సన్ తన సేవలను అందించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడాడు. ఆర్ఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలుచుకున్నాడు. 2013లో కూడా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2019 ఫైనల్లో కూడా వాట్సన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు కేకేఆర్ కోచింగ్ స్టాప్‌లో జాయిన్ అయ్యాడు.
Also Read: Suryakumar Yadav: నేను ఆడను.. సూర్యకుమార్ కీలక నిర్ణయం!
కేకేఆర్‌లో భాగం కావడంపై షేన్ వాట్సన్ స్పందించాడు. ఆస్ట్రేలియా తరపున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 4, వన్డేల్లో 9, టీ20ల్లో 1 సెంచరీ బాదాడు. వరుసగా 3731, 5757, 1462 రన్స్ చేశాడు. ఇక టీ20ల్లో 145 మ్యాచ్‌లు ఆడి 3874 రన్స్ బాదాడు. ఐపీఎల్‌లో వాట్సన్ 4 శతకాలు బాదాడు. వాట్సన్ అనుభవం కచ్చితంగా కేకేఆర్‌కు కలిసిరానుంది.