పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. 2008లో ముంబై పేలుళ్ల తర్వాత బీసీసీఐ పాకిస్థాన్‌ను నిషేదించింది. 2012-13 నుంచి ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇరు దేశాలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. తాజా టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. టీమిండియాతో ఆడకపోతే […]
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి షెడ్యూల్ ఖరారు ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 15 నిమిషాలు రోడ్డు షో, గంట పాటు సభ ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా […]
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత ప్రదర్శన చేస్తోన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువయ్యాయి. లేటుగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నాలుగు టీమ్స్ పాయింట్ల పట్టికలో టాప్ -4లో కొనసాగుతున్నాయి. 10 పాయింట్లతో […]
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే.. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. సీఎస్కే ప్లేఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. మిగిలిన 5 మ్యాచ్‌లలో గెలిచినా.. 14 పాయింట్స్ మాత్రమే ఖాతాలో చేరుతాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం సీఎస్కే ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యం. సీఎస్కే పరాజయ పరంపర నేపథ్యంలో […]
ఐపీఎల్ 2025లో మొదటిసారి ఓ మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. ఛేదనలో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ ముగిశాక వర్షం మొదలైంది. భారీ గాలులకు మైదానంను కవర్లతో కవర్ చేయడం కూడా కష్టమైంది. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆట సాధ్యం కాలేదు. వరుణుడి ప్రతాపంతో మ్యాచ్ రద్దు కావడంతో.. రెండు జట్లకు చెరో […]
ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం రాత్రి చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) టీమ్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో రెండు జట్లు ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడి.. 2 విజయాలు, 6 పరాజయాలను చవిచూశాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. సీఎస్కే అట్టడుగున పదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఈ రెండు జట్లకు విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సీఎస్కే, ఎస్ఆర్హెచ్ జట్లకు […]
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు తన కెరీర్లో 400వ టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో సీఎస్కే తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా ధోనీ 400వ టీ20 మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రపంచవ్యాప్తంగా 400వ టీ20 మ్యాచ్ ఆడిన 24వ ఆటగాడిగా.. భారత్ నుంచి నాలుగో ప్లేయర్‌గా నిలుస్తాడు. భారత్ నుంచి రోహిత్ శర్మ (456), […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక సార్లు సిక్సర్ బాదిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. జైస్వాల్ ఇప్పటివరకు మూడు సార్లు మొదటి బంతికే సిక్సర్ బాదాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సిక్సర్ బాదడంతో జైస్వాల్ ఖాతాలో ఈ ఫీట్ చేరింది. ఐపీఎల్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లోని మొదటి బంతికే మొత్తం […]
ఐపీఎల్ 2025 మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి. గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆరో విజయంతో 12 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. ఈ మూడు టీమ్స్ మరో రెండు విజయాలు సాధిస్తే.. అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటాయి. రేసులో […]
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (ఏప్రిల్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,050గా.. 24 క్యారెట్ల ధర రూ.98,240గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3000, రూ.110 తగ్గగా.. 22 క్యారెట్లపై వరుసగా రూ.2750, రూ.100 తగ్గింది. Also […]