చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో సీఎస్‌కే తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా ధోనీ 400వ టీ20 మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రపంచవ్యాప్తంగా 400వ టీ20 మ్యాచ్ ఆడిన 24వ ఆటగాడిగా.. భారత్ నుంచి నాలుగో ప్లేయర్‌గా నిలుస్తాడు.
భారత్ నుంచి రోహిత్ శర్మ (456), దినేశ్ కార్తిక్ (412), విరాట్ కోహ్లీ (408)లు ఇప్పటికే 400వ టీ20 మ్యాచ్ ఆడేశారు. వీరి సరసన ఎంఎస్ ధోనీ చేరనున్నారు. కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ ఆడిన రెండో భారత వికెట్ కీపర్‌గా మహీ రికార్డు సృష్టించనున్నాడు. ఇప్పటికే డీకే 400వ టీ20 మ్యాచ్ ఆడేశాడు. రోహిత్ 456 మ్యాచ్‌లలో 8 సెంచరీలు, 80 అర్ధ సెంచరీలతో 12,058 పరుగులు చేశాడు. దినేశ్ కార్తిక్ 412 మ్యాచ్‌లు ఆడి 35 అర్ధ సెంచరీలతో 7,537 పరుగులు బాదాడు. విరాట్ 408 మ్యాచ్‌లలో తొమ్మిది సెంచరీలు, 102 అర్ధ సెంచరీలతో 13,278 పరుగులు చేశాడు.
400 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత ప్లేయర్స్:
రోహిత్ శర్మ (456)
దినేశ్ కార్తిక్ (412)
విరాట్ కోహ్లీ (408)
ఎంఎస్ ధోనీ (399)