ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం రాత్రి చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) టీమ్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో రెండు జట్లు ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడి.. 2 విజయాలు, 6 పరాజయాలను చవిచూశాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. సీఎస్‌కే అట్టడుగున పదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఈ రెండు జట్లకు విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారో.
మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ జోస్యం చెప్పారు. చెపాక్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై సీఎస్‌కేదే విజయం అని పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌పై చెన్నై గెలుస్తుందని నేను భావిస్తున్నా. అందుకు కారణం చెన్నై స్పిన్ విభాగం చాలా బలంగా ఉండడమే. చెన్నై గత మ్యాచుల ఫలితాలను మరిచి.. ముందుకు సాగాలి. జట్టులోని కుర్రాళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ సీజన్లో హైదరాబాద్ నిలకడ లేకుండా ఆడుతోంది. ఇదే ఆ జట్టు కూటములకు ప్రధాన కారణం. దూకుడుగా ఆడే ప్లేయర్లు ఉన్నా.. విఫలం అవుతున్నారు. కీలక ఆటగాళ్ల వైఫల్యమే ఎస్‌ఆర్‌హెచ్‌ను వెంటాడుతోంది’ అని సంజయ్ బంగర్ చెప్పారు.
Also Read: CSK vs SRH: ఎంఎస్ ధోనీ @ 400!
తుది జట్లు (అంచనా):
చెన్నై: రచిన్ రవీంద్ర, షేక్ రషీద్, ఆయుశ్ మాత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), జేమీ ఓవర్టన్, ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మహీశ పతిరణ.
హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జైదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ.