హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2025 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన షార్ట్‌లిస్ట్ జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. ఐపీఎల్ 2025లో మిగిలిన 16 మ్యాచ్‌ల కోసం బీసీసీఐ మూడు వేదికలను షార్ట్‌లిస్ట్ చేయగా.. లిస్ట్‌లో బెంగళూరు, చెన్నై సహా హైదరాబాద్ కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ఈ మూడు నగరాల్లో […]
పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తోందని, పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు అని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. భారత జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. చచ్చే వరకు భారత భూమి కోసమే బ్రతకాలని ఎమోషనల్ అయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హైదరాబాద్ ఎంపీ అన్నారు. […]
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్ వాయిదా పడింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పీఎస్ఎల్ 2025ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం (మే 7) నుంచి పీఎస్ఎల్ మ్యాచ్ జరగలేదు. గురువారం రావల్పిండిలో కరాచీ కింగ్స్, పెషావర్ జల్మీ మధ్య మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. రావల్పిండి స్టేడియంకు సమీపంలో భారత్ దాడులు జరపడంతో ఈ మ్యాచ్ రద్దు అయింది. భారత్, పాకిస్థాన్ […]
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గ అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాధ పిల్లలకు నెలకు రూ.5000 చొప్పున తన వేతనం నుండి అందిస్తానని ప్రకటించారు. మిగిలిన జీతం కూడా వారి బాగోగుల కోసమే ఖర్చు పెడతానని పవన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాలం ప్రతి నెల ఒకటో తేదీన 42 […]
భారత్ నిజంగా యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రధాని మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదని, దేశం ఎంతో సంయమనం పాటించిందన్నారు. ఆడ బిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే.. ఇద్దరు ఆడబిడ్డలు ధర్మయుద్దానికి నాయకత్వం వహించారన్నారు. ఏ ఒక్క పాకిస్తానీ సామాన్యుని ముట్టుకోలేదని, కేవలం ముష్కరుల స్థావరాలపైనే దాడి జరిగిందన్నారు. దేశ సహనాన్ని చేతకాని తనం అనుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని ఎంపీ రఘునందన్ […]
దేశభక్తితో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ తల్లిదండ్రులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని సీఎం హామీ ఇచ్చారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు సీఎం మౌనం పాటించారు. ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో వీర సైనికుడు […]
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తన వీరాభిమాని అయిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలుతో కలిసి భోజనం చేశారు. పేరంటాలు కోరిక మేరకు ఈరోజు జనసేన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి.. ఆవిడతో కలిసి పవన్ భోజనం చేశారు. అంతేకాదు చీర, లక్ష రూపాయల నగదును కూడా అందించారు. డిప్యూటీ సీఎంను కలవడమే కాకూండా.. భోజనం చేయడంతో పేరంటాలు సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్‌తో పేరంటాలు భోజనం […]
డిప్యూటీ కలెక్టర్‌ను తహశీల్దారుగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అంతేకాదు కోర్టు ధిక్కరణ కింద రెండు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు ధర్మాసనం ఆదేశాలు […]
తెలంగాణ ఈఏపీసెట్ పలితాలు ఆదివారం (మే 11) విడుదల కానున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫలితాలను రిలీజ్ చేస్తారు. జేఎన్టీయూ, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈఏపీసెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల అధికారులు వెల్లడిస్తారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీసెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. Also Read: KTR: స్థానిక ఎన్నికల్లో […]
తొందర్లోనే స్థానిక ఎన్నికలు వస్తాయని, స్థానిక ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లు మోసపోయాం అని, మళ్లీ మోసపోవద్దని కేసీఆర్ చెప్పారని.. కానీ తాత్కాలికంగా మోసపోయాం అని పేరొన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, రుణమాఫీ కూడా చేయలేకపోయిందని మండిపడ్డారు. రైతుబందు మొదటి పంటకే గతి లేదు అని ఎద్దేవా చేశారు. పేదలకు అండగా నిలిచేది బీఆర్ఎస్ […]