ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మే 7న రోహిత్, మే 12న విరాట్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రో-కో రిటైర్మెంట్తో అభిమానులు నిరాశ చెందారు. కొంతమంది క్రికెట్ మాజీలు అయితే ఇద్దరూ కొంతకాలం టెస్ట్ క్రికెట్లో కొనసాగాల్సిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విరాట్ మైదానంలో ఇప్పటికీ యువ ఆటగాడిలా ఫిట్‌గా […]
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ 2025 మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ఫ్లడ్‌లైట్ల సమస్య వల్లే మ్యాచ్ ఆగిందని ముందుగా అందరూ అనుకున్నా.. సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని తర్వాత తెలిసింది. ఈ మ్యాచ్ జరుగుతున్నపుడు ధర్మశాల స్టేడియంలోనే ఉన్న ఆస్ట్రేలియా మహిళలా టీమ్ కెప్టెన్, మిచెల్ స్టార్క్ సతీమణి అలీసా హీలీ.. తనకు […]
శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి ఎంపీపీ ఎన్నికపై మరోసారి ఉత్కంఠత నెలకొంది. రెండు రోజుల క్రితం ముగ్గురు ఎంపీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. వైసీపీలోనే కొనసాగుతా అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వెనక్కి వచ్చారు. టీడీపీ నేతలు తనను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లారని, ఇతనకు ఇష్టం లేకున్నా పార్టీ కండువా కప్పారని భారతి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారని, తనకు ఎలాంటి […]
ఇవాళ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇటీవల ఒంగోలులో హత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి ఏప్రిల్ 22న రాత్రి 7.30 గంటల సమయంలో ఒంగోలులోని ఆయన కార్యాలయంలో దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయన్ను 53 సార్లు విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. Also Read: RCB-IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. హిట్టర్ వచ్చేశాడు! […]
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025 కోసం వెస్టిండీస్ హిట్టర్ రొమారియో షెపర్డ్ భారత్‌కు వచ్చేశాడు. ఈ విషయాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మెంటర్ డ్వేన్ బ్రావో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపాడు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో విండీస్ వెళ్లిన షెపర్డ్.. తిరిగి భారత్ చేరుకున్నాడు. వాయిదా పడిన ఐపీఎల్ 2025 ఈ నెల 17 నుంచి పునః ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రొమారియో షెపర్డ్ […]
పశు సంవర్ధక శాఖలో కీలక మార్పులు చెయ్యడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్‌పై కసరత్తు చెయ్యాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పశు సంవర్ధక శాఖ కాంక్లేవ్‌లో స్టార్టప్ ప్రతినిధులు వివిధ అంశాలను సీఎంకు వివరించారు. బుధవారం ఉదయం విజయవాడలో స్టార్టప్ కంపెనీలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. Also Read: AP Liquor Scam: గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు! మనుషులకు ఆధార్ లాగా పశువులకు గోదార్‌ను […]
ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టుకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో గోవిందప్ప ఏ33గా ఉన్నారు. కుంభకోణంలోని వేల కోట్లను డొల్ల కంపెనీలకు మళ్లించి అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో గోవిందప్ప కీలక పాత్ర పోషించారు. ఇక గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ […]
జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం: జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం అని, బీజేపీ మతతత్వ పార్టీ కాదని జకియా ఖానం చేరిక ద్వారా చెపొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కులమతాలకు తావులేకుండా భారతీయులుగా ముందుకెళ్లాలన్నది బీజేపీ నినాదం.. మూల సిద్ధాంతం అని చెప్పారు. దేశంలో బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో దృఢమైన నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారని పురంధేశ్వరి ప్రశంసించారు. ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి గుడ్ […]
కొన్ని రోజుల క్రితం ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధర.. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. నిన్న భారీగా పెరిగిన పసిడి రేట్లు.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.540 తగ్గితే.. 22 క్యారెట్లపై రూ.500 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (మే 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,050గా.. 24 క్యారెట్ల ధర రూ.96,060గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. […]
జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం అని, బీజేపీ మతతత్వ పార్టీ కాదని జకియా ఖానం చేరిక ద్వారా చెపొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కులమతాలకు తావులేకుండా భారతీయులుగా ముందుకెళ్లాలన్నది బీజేపీ నినాదం.. మూల సిద్ధాంతం అని చెప్పారు. దేశంలో బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో దృఢమైన నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారని పురంధేశ్వరి ప్రశంసించారు. ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన జకియా ఖానం.. […]