వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి కోర్టు రిమాండ్ విధించింది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై కేసు నమోదైంది. పోలీసులు పిటీ వారెంట్ దాఖలు చేసి వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకి కూడా రిమాండ్ విధించింది. […]
ఆసియాలో అతిపెద్ద మామిడి మార్కెట్‌గా పేరున్న నున్న ఈసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మామిడి కాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు, వ్యాపారులు, కూలీలతో కళకళలాడాల్సిన మార్కెట్.. ఈసారి వెలవెలబోతోంది. ముఖ్యంగా వ్యాపారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అకాల వర్షాలు, గాలివానలు, కోడిపేను తెగుళ్లతో పంట దిగుబడి భారీగా తగ్గింది. పూత వచ్చినా.. కాయ దశకు రాకముందే పాడైపోయింది. Also Read: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. ఆనందంలో ఆర్సీబీ ఫాన్స్! నున్న మామిడి మార్కెట్లో […]
ఐపీఎల్ 2025 పునఃప్రారంభమవుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఐపీఎల్ తాను తిరిగి రావడం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి స్టార్క్ తెలిపాడు. ఫ్రాంఛైజీ కూడా స్టార్క్ నిర్ణయానికి అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. స్టార్క్ తిరిగి రావడంపై ముందు నుంచి సందేహాలు నెలకొన్నాయి. తాజాగా అతడు క్లారిటీ ఇచ్చాడు. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ […]
మన నేలపై ఉత్పత్తయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాకుండా.. భారతదేశానికి మొత్తం సరఫరా చేస్తాం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదు ఉద్యమం అని పేర్కొన్నారు. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశాం అని, ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్జాజెక్ట్ రూపకల్పన చేశామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. త్వరలోనే […]
త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయని విమర్శించారు. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్‌లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారని మండిపడ్డారు. రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయని, రాజకీయాల్లో కాదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. […]
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదైంది. మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్లో వంశీపై పిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలపై నివేదికను ఆయన పోలీసులకు అందించారు. 2019-2024 సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీ ఫిర్యాదు మేరకు […]
ఆటకు ఇవ్వగలిగినంత ఇచ్చానన్న స్పష్టతతో విరాట్ కోహ్లీ ఉన్నాడని, అతడిలో ఎలాంటి విచారం లేదు అని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. విరాట్ రిటైర్ కావడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. మరో 2-3 ఏళ్లు టెస్ట్ ఫార్మాట్లో ఆడే సత్తా అతడిలో ఉందని అభిప్రాయపడ్డాడు. విశ్రాంతి తీసుకోకపోతే మానసికంగా అలసిపోక తప్పదు అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. విరాట్ టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌కు ముందు తనకు ఇష్టమైన సాంప్రదాయ ఫార్మాట్‌కు […]
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండవ రోజు కస్టడీకి తీసుకుంది. శ్రీధర్ రెడ్డిని ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి ఆయన్ను అధికారులు తరలించారు. సిట్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. నిన్న ఏడు గంటల పాటు శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. కీలక ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. Also […]
గోల్డ్ రేట్స్ తగ్గాయన్న సంతోషం మగువలకు రెండు రోజులే ఉంది. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి.. నేడు భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,200 పెరగ్గా.. 22 క్యారెట్లపై రూ.1,100 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (మే 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,200గా.. 24 క్యారెట్ల ధర రూ.95,130గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. […]
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పిస్తామని బురిడీ కొట్టించే వారు రోజుకొకరు పెరిగిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన సమయం నుంచి అధికారులు కేటుగాళ్ల భరతం పడుతున్నారు. భక్తుల ఫిర్యాదుల మేరకు అనతి కాలంలోనే పలువురిని విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు మాత్రం భక్తుల అమయాకత్వాన్ని క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీవారి దర్శనం పేరిట భక్తులను మోసం చేసిన ఘటన […]