అనంతపురం జిల్లాలో రెండవ రోజు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. గుత్తి మండలం బేతేపల్లి గ్రామంలో సోలార్ ప్లాంట్‌కు నేడు మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా శంకుస్థాపన చేయనున్నారు. ఇండియాలో అతి పెద్ద రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దావోస్‌లో ఈ సంస్థ ఏర్పాటులో లోకేష్ కీలక పాత్ర పోషించారు. సుమారు 22 వేల కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. తొలి దశలో 587 మెగా వాట్ల సోలార్, 250 మెగా […]
ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కాబోతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీకి గుడ్ న్యూస్. ఏకంగా ఆరుగురు విదేశీ మ్యాచ్ విన్నర్స్ ఐపీఎల్ 2025లో ఆడనున్నారు. రొమారియో షెపర్డ్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జోష్ హేజిల్‌వుడ్, లుంగి ఎంగిడిలు మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు. ఇక జేకబ్ బెథెల్ మాత్రమే ఐపీఎల్ లీగ్ దశ అనంతరం ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. విషయం తెలిసిన ఆర్సీబీ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి […]
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ దూరం కానున్నాడు. జాతీయ జట్టు (ఇంగ్లండ్) తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు మే 26న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ అనంతరం బట్లర్ ఇంగ్లండ్ పయనం కానున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో గుజరాత్ ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. కీలక ప్లేఆఫ్స్‌కు బట్లర్ దూరం కావడం జీటీకి గట్టి ఎదురుదెబ్బే అని […]
భారత్, పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తల మధ్య ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పదం కుదరడంతో.. మే 17 నుంచి మ్యాచ్‌లు పున:ప్రారంభం కానున్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం.. మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ప్లేయర్లు.. తిరిగి భారత్‌కు చేరుకుంటున్నారు. అయితే కొందరు ప్లేయర్స్ తాము ఐపీఎల్ 2025కి […]
టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌కు ముందు తనకు ఇష్టమైన సాంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి అందరికీ షాక్ ఇచ్చాడు. విరాట్ అప్పుడే రిటైర్మెంట్ ఇవ్వాల్సింది కాదని, మరికొన్ని సంవత్సరాలు ఆడాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. విరాట్ ఉన్నపళంగా వీడ్కోలు పలకడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అని ఫాన్స్ ఆసక్తిగా చుస్తున్నారు. రిటైర్మెంట్ నేపథ్యంలో విరాట్ టీ20, టెస్ట్ కెరీర్ […]
కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మంత్రిగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం మండిపడింది. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండని, ముందుగా హైకోర్టులో క్షమాపణలు చెప్పండని మంత్రి విజయ్ […]
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఒక వారం పాటు ఐపీఎల్ 2025 నిలిచిపోయిన విషయం తెలిసిందే. మే 17 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఐపీఎల్ 2025లోని మిగిలిన మ్యాచ్‌ల కోసం బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆటగాళ్లకు తదుపరి సీజన్‌కు అర్హత ఉండదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ప్లేయర్స్ ఐపీఎల్ 2025 వరకే కొనసాగుతారని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ప్రకటించాయి. Also Read: IPL 2025: ఐపీఎల్ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలకు భారీ ఊరట లభించింది. జూన్ 3 వరకు సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు స్వయంగా తెలిపింది. దాంతో కగిసో రబాడా, ఐడెన్ మార్క్రమ్, ఫాఫ్ డుప్లెసిస్, లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్.. తదితరు ప్లేయర్స్ ఐపీఎల్ 2025లో ఆడనున్నారు. త్వరలోనే ప్రొటీస్ ప్లేయర్స్ భారత్ రానున్నారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఒక వారం పాటు […]
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఐపీఎల్‌ను తిరిగి ఆరంబించేందుకు బీసీసీఐ సిద్దమైంది. ఐపీఎల్ మ్యాచ్‌లు మే 17 నుంచి ఆరంభం కానున్నాయి. మే 17న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, కోల్‌కతా మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ ఓ విన్నపం చేశారు. […]
గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నేడు భారీ స్థాయిలో తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,130 తగ్గితే.. 22 క్యారెట్లపై రూ.1,950 తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (మే 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.93,930గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో లక్షకు […]