ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ దూరం కానున్నాడు. జాతీయ జట్టు (ఇంగ్లండ్) తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు మే 26న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ అనంతరం బట్లర్ ఇంగ్లండ్ పయనం కానున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో గుజరాత్ ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. కీలక ప్లేఆఫ్స్‌కు బట్లర్ దూరం కావడం జీటీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇక బట్లర్ స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్‌ను గుజరాత్ రూ.75 లక్షలకు తీసుకుంది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మరలా గాయపడ్డాడు. గాయంతో కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న మయాంక్.. ఐపీఎల్ 2025లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడ. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన అతడు రెండే మ్యాచ్‌లు ఆడాడు. మయాంక్ మళ్లీ గాయపడ్డాడు. గాయంతో ఐపీఎల్ 2025లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మయాంక్ స్థానంలో న్యూజిలాండ్ పేసర్ విలియం ఓ రూర్క్‌ను రూ.3 కోట్లకు జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 2025లో నిలకడగా 150 కిమీ వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన మయాంక్ పదేపదే గాయాలపాలవ్వడం లక్నోకు ఇబ్బందికరంగా మారింది.