పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత 3-4 రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల ధర రూ.440 తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (మే 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,950గా.. 24 క్యారెట్ల ధర రూ.97,040గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. Also Read: […]
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అంతర్వేదికరలో కాపు సంఘాలు వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్నికి అనుమతి లేదు అంటూ పోలీసులు తొలగించారు. పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని అంటూ కాపు సంఘాలు వాగ్వివాదానికి దిగాయి. విగ్రహం తొలగించడంతో తెల్లవారుజాము నుంచి కాపు సంఘాల నేతలు ఆందోళన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విగ్రహాన్ని మళ్లీ ఇదే ప్లేసులో పెట్టడానికి ప్రయత్నించిన కాపు […]
ప్రపంచంలో చాలా అందమైన ప్రాంతాలను చూశానని.. ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడున్న విశాలమైన కొండలు, లోయలు చూస్తుంటే తన మనసు పులకించిందన్నారు. గండికోట ప్రాంతంలో త్వరలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గండికోటను మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ రకంగానూ అభివృద్ధి చేయలేదు అని పెమ్మసాని విమర్శించారు. నేడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన గండికోటను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి […]
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర’ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసు యోగాంధ్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. అంతేకాదు యువతీ యువకులు […]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు గారి ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందని ప్రశంసించారు. చంద్రబాబు అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత […]
ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ ముల్లాన్‌పుర్‌లో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరడం ఇది పదోసారి. ఇప్పటివరకు బెంగళూరు మూడు ఫైనల్స్‌లో ఆడింది కానీ.. ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. 2016లో చివరిసారిగా ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో ఈసారి టైటిల్ లక్ష్యంగా ముందుకు దూసుకెళుతోంది. క్వాలిఫైయర్ 1లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న […]
మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళకు పరీక్షలో కోవిడ్ నిర్ధారణ అయింది. చిలకలూరిపేటకు చెందిన వృద్దుడు, బాపట్లకు చెందిన మరో మహిళకు […]
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పంజాబ్, బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న గుజరాత్, ముంబై టీమ్స్ ఎలిమినేటర్‌లో ఢీకొంటాయి. క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో (ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మ్యాచ్) […]
కడప జిల్లాలో టీడీపీ ‘మహానాడు’ అంగరంగ వైభవంగా జరుగుతోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే మహానాడులో ఇప్పటికే రెండు రోజులు విజయవంతగా పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్విరామంగా సమావేశాలు నిర్వహించారు. పసుపు పండగలో రెండోరోజు ప్రతినిధుల సమావేశాలు ముగిశాయి. ఇక చివరి రోజైన గురువారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మహానాడులో గురువారం మూడోరోజు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల […]
ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్‌కు వేళైంది. నేడు ముల్లాన్‌పుర్ (చండీగఢ్)లో తొలి క్వాలిఫయర్ జరగనుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడనున్నాయి. క్వాలిఫయర్ 1లో విజేతగా నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఫైనల్లో చోటు కోసం ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2లో తలపడాల్సి ఉంటుంది. బెంగళూరు, పంజాబ్ జట్లు మంచి ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో హోరీహోరీ […]