జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ఆరు నెలల తర్వాత ఉంటుందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఉప ఎన్నికల కోసం కుల సమీకరణ ఆధారంగా అభ్యర్థిని బీజేపీ నిర్ణయించబోతోందని పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంకును బీఆర్ఎస్కి ఎంఐఎంలు విక్రయించారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు ఏ పార్టీకి అమ్ముతారో చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ […]
రెండు రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. రెండు గంటలకు పైగా చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల పైనా విస్తృతమైన చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి […]
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, హరీశ్ రావు మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు విచారణ అంశంపై చర్చిస్తున్నారు. బలప్రదర్శన ఏర్పాట్లపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్‌కి ఇచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. అయితే హరీష్ రావును […]
కలకాలం తోడు నీడగా ఉండాల్సిన భర్త అనుమానంతో భార్యను కడతేర్చాడు. వివాహేతర సంబంధం ఉందనే కారణంతో భార్యను చున్నీతో ఉరివేసి చంపాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. భార్యను చంపిన తర్వాత భర్త పోలీసులకు లొంగిపోయాడు. తన భార్యను తానే చంపినట్లు పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న సరూర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. Also Read: Balakista Reddy: ఆగస్టు 14 లోపు ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభిస్తాం.. డబ్బులు వృధా […]
తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చూపించే ప్రభుత్వం అని ఐటీ శాఖా మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేయొద్దని, తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు చూసి శైవ గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుందని తెలిపారు. 18 నెలల్లో 3 లక్షల […]
పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని బస్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ గేటు ముందు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు వాహనాల్లో తరలించారు. ఎమ్మెల్సీ కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం బస్ భవన్ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. బస్ పాస్ ఛార్జీలను పెంచినట్లు ఆర్టీసీ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు షాకింగ్ న్యూస్. ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ యాజమాన్యం 'డయాజియో' ఫ్రాంచైజీని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోందట.
తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది. 27 మందికి ఉపాధ్యక్షులుగా, 69 మందికి ప్రధాన కార్యదర్శులుగా టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులను భర్తీ చేసింది. నూతన కార్యవర్గంలో ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు చోటు లభించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా […]
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగింది. సిట్ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ప్రభాకర్ రావుపై డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేటి విచారణ ముగియగా.. జూన్ 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు సూచించారు. విచారణకి ఎప్పుడు పిలిచినా […]
ప్రస్తుతం ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని, తమ సంక్షేమ కార్యక్రమాలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు పైబడి గెలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అజెండానే పాలనగా చేస్తున్నాం అని, సంపద అంతా వెనుకబడిన వర్గాల వారికి అందేలా చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అనిపేర్కొన్నారు. 1931లో కులగణన చేశారని, తెలంగాణ కాంగ్రెస్ మాత్రమే మరలా ఇప్పుడు చేసిందన్నారు. లక్ష కోట్లు మహిళలందరికీ […]