దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం ‘శాంసంగ్’ తన మొట్టమొదటి డ్యూయల్-ఫోల్డింగ్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ‘గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్’ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ దక్షిణ కొరియా మార్కెట్లో మాత్రమే విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవనుంది. కంపెనీ తాజాగా అన్‌బాక్సింగ్ వీడియోను రిలీజ్ చేసింది. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో ప్రకారం.. గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ ఫోన్‌ను టాబ్లెట్‌గా కూడా వాడుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ ఫోన్ 10 ఇంచెస్ మెయిన్ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీరు దీనిని టాబ్లెట్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఫోన్ కవర్ స్క్రీన్ 6.5 ఇంచెస్ ఉంటుంది. ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్ లాగా ఉంటుంది. కంపెనీ అన్‌బాక్సింగ్ వీడియోను విడుదల చేయగా.. చైనాలో లాంచ్ అయిన హువావే మేట్ ఎక్స్‌టీతో పోల్చుతున్నారు. హువావే మేట్ ఎక్స్‌టీ కంటే గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ చాలా భిన్నంగా ఉంటుంది. హువావే ఫోన్ Z స్టైల్‌లో మడవబడుతుంది. శాంసంగ్ ఫోన్ G స్టైల్‌లో ఫోల్డ్ అవుతుంది. దీని కవర్ స్క్రీన్ మధ్యలో ఉంటుంది. ప్రధాన డిస్‌ప్లే వేరుగా ఉంటుంది. మరోవైపు హువావే ఫోన్ మడతపెట్టి విప్పే ఒకే డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. శాంసంగ్ బాక్స్‌లో ఛార్జర్‌ను కూడా ఇచ్చింది. ఇతర శాంసంగ్ ఫోన్‌లలో ఈ ఆప్షన్ లేదు. దక్షిణ కొరియాలో దీని ధర 16జీబీ+512జీబీ బేస్ వేరియంట్ ధర KRW 3,594,000 (సుమారు రూ. 2.2 లక్షలు) నుండి ప్రారంభమవుతుంది. 10.0-ఇంచెస్ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. స్క్రీన్ 1600 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఇది 2600 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో 6.5-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
Also Read: IND vs SA: విశాఖలో టీమిండియా రికార్డులు అద్భుతం.. ధోనీ గుర్తింపు, రో-కో ఫైర్‌బ్రాండ్ ఇక్కడే!
గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 200MP ప్రైమరీ లెన్స్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో కవర్ స్క్రీన్‌పై 10MP సెల్ఫీ కెమెరా, ప్రధాన స్క్రీన్‌పై 10MP కెమెరాను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5600mAh బ్యాటరీతో లాంచ్ అయింది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 309 గ్రాములు.