వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. రాంచీ, రాయ్‌పుర్‌లో రెండు మ్యాచ్‌లు ముగియగా.. సిరీస్ 1-1తో సమంగా ఉంది. వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మూడో మ్యాచ్ మధ్యాహ్నం 1.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్ విజేతగా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. అయితే వైజాగ్‌లో భారత్‌కు ఉన్న ఏకైక ప్రయోజనం ఏమిటంటే.. అద్భుతమైన రికార్డు. అంతేకాదు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రాణిస్తుండడం.
విశాఖ మైదానంలో టీమిండియా, ఆటగాళ్లకు అద్భుతమైన రికార్డు ఉంది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 148 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది ఈ మైదానంలోనే. ప్రపంచం ముందుగా ధోనీ మార్క్ బ్యాటింగ్ చూసింది ఇక్కడే. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ మైదానంలో వన్డేల్లో భారీగా పరుగులు చేశారు. విశాఖ మైదానంలో ఇద్దరికీ అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఇక్కడ భారత్ మొత్తం 10 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. 2018 అక్టోబర్ 24న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే టై అయింది.
విశాఖ మైదానంలో మొదటి వన్డే మ్యాచ్ 5 ఏప్రిల్ 2005న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ చారిత్రాత్మకమైనది అనే చెప్పాలి. ఈ మ్యాచ్ ఎంఎస్ ధోనీకి ఐదవ వన్డే కాగా.. అతను మొదటిసారి మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసి 123 బంతుల్లో 148 పరుగులు రన్స్ బాదారు. రెండు క్యాచ్‌లు కూడా అందుకున్నారు. ఈ మ్యాచ్ తర్వాత మహీ హీరో అయ్యారు. నిజానికి ధోనీ మొదటి నాలుగు వన్డేలు ఆకట్టుకోలేకపోయారు. 2004 డిసెంబర్ 23న చిట్టగాంగ్‌లో తొలి వన్డే ఆడగా.. పరుగులు చేయకుండానే రనౌట్ అయ్యారు. ఢాకాలో జరిగిన రెండవ మ్యాచ్‌లో 12 పరుగులు, మూడవ మ్యాచ్‌లో 7 పరుగులు చేశారు. కొచ్చిలో జరిగిన నాల్గవ వన్డేలో 3 పరుగులు చేశారు. వైజాగ్‌కు వచ్చిన తర్వాత మహీ కెరీర్ మారిపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో 65.00 సగటు, 104.83 స్ట్రైక్ రేట్‌తో 260 పరుగులు చేశారు.
Also Read: 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. 12 వేలకే Redmi 15C 5G స్మార్ట్‌ఫోన్!
వైజాగ్‌లో పరుగులు చేయడంలో విరాట్ కోహ్లీకి సాటి ఎవరూ లేరు. ఇక్కడ 7 వన్డేలలో 587 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మైదానంలో కింగ్ కోహ్లీ బ్యాటింగ్ సగటు 97.83 కాగా.. స్ట్రైక్ రేట్ 100.34. ఈ మైదానంలో అతని అత్యధిక స్కోరు 157 నాటౌట్. 24 అక్టోబర్ 2018న వెస్టిండీస్‌పై ఈ స్కోర్ చేశాడు. ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. ఏడు మ్యాచ్‌ల్లో 355 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 59.16 సగటు, 99.43 స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేశాడు. కుల్దీప్ యాదవ్ ఇక్కడ నాలుగు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు.