Netanyahu-Iran: ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
- ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
- ఈసారి దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
- టెహ్రాన్ నాయకత్వానికి నేరుగా హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తులో ఇరాన్ మరోసారి దాడికి పాల్పడితే గతంలో కంటే ఎన్నో రెట్లు తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంటూ టెహ్రాన్ నాయకత్వానికి నేరుగా హెచ్చరికలు చేశారు.
దక్షిణ ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరంలో జరిగిన నెగెవ్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన నెతన్యాహు.. ‘‘ఇరాన్ నాయకులకు నేను ఒకటే చెబుతున్నా.. మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్ మౌనంగా ఉంటుందని అనుకోవద్దు. గతంలో జరిగినట్లే ఈసారి కూడా ఉంటుందని అసలు ఊహించకండి. ఈసారి మా ప్రతిస్పందన మరింత శక్తివంతంగా ఉంటుంది.’’ అని హెచ్చరించారు. ఇరాన్ లేదా దానికి మద్దతుగా పనిచేస్తున్న సంస్థలు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తే ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా మాపై దాడి చేస్తే మేము గట్టిగా ప్రతీకారం తీర్చుకోకుండా ఊరుకునే రోజులు ముగిశాయని.. ఇరాన్ నేతృత్వంలోని అక్ష దుష్ట శక్తులు నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఇజ్రాయెల్ బలంగా ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ మరోసారి దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Also Read
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నేరుగా క్షిపణి దాడులు జరిగిన తర్వాత పరిస్థితి కొంత ప్రశాంతంగా మారినప్పటికీ.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించకుండా దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతుండగా.. లెబనాన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా సహా పలు మిలిటెంట్ సంస్థల నుంచి వచ్చే ముప్పుపై కూడా ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది.
ఈ సందర్భంగా హిజ్బుల్లాపై కూడా నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత హిజ్బుల్లా సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. యుద్ధానికి ముందు ఉన్న క్షిపణి నిల్వల్లో ప్రస్తుతం కేవలం 7 నుంచి 8 శాతం మాత్రమే హిజ్బుల్లా దగ్గర మిగిలి ఉందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై హిజ్బుల్లా ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. గాజా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, యుద్ధానికి ముందు కంటే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో జనాభా మరింత పెరిగిందని తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!