ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేయనున్నారు. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి […]
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారుడిని కన్న తండ్రే కడతేర్చాడు. సోమవారం రాత్రి జరిగిన కొట్లాటలో కసాయి కొడుకుని తండ్రి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… Also Read: AP BJP President: ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన! గోళ్ల వెంకటనారాయణ […]
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నూతన అధ్యక్షుడి పేరును ఈరోజు అధిష్టానం ప్రకటించనుంది. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరు నిన్ననే ఖరారు కాగా.. నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈరోజు ఉదయం 10:45కు అధ్యక్షుని పేరును ప్రకటిస్తారు. అనంతరం పదవీ ప్రమాణం, బాధ్యతల స్వీకరణ ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు. కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఏపీ బీజేపీ అధ్యక్ష […]
ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను మూడింటిలో మాత్రమే ఆడించాలని టీమిండియా టీమ్‌మేనేజ్‌మెంట్ ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఐదు వికెట్స్ పడగొట్టాడు. అయితే తొలి టెస్టులో భారత్ ఓటమిపాలై.. 0-1తో సిరీస్‌లో వెనుకబడింది. ఇక జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలనుంది. ఈ టెస్టులో బుమ్రా ఆడుతాడో లేదో అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై టీమిండియా అసిస్టెంట్ […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది?, ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది?, ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి?, ఎవరు విరమించుకోవాలి?, ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి?, ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది?, మంచి జరగాలంటే ఏం చేయాలి?.. ఇలా పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం. కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. జాగ్రత్తగా ఉండల్సిన అవసరం ఉంది. […]
ప్రస్తుతం మూడు భారత జట్లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి. సీనియర్ పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడుతుండగా.. మహిళల జట్టు టీ20 సిరీస్‌ను ఆడుతోంది. మరోవైపు ఆయుష్ మాత్రే అండర్-19 జట్టు కూడా ఇంగ్లండ్‌లోనే పర్యటిస్తోంది. ఇంగ్లీష్ యువ జట్టుతో ఆయుష్ మాత్రే టీమ్ మ్యాచ్‌లు ఆడుతోంది. మొత్తంగా భారత క్రికెటర్స్ అందరూ ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. ఇక జులైలో భారత క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. భారత పురుషుల […]
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) రెండవ సీజన్ కోసం రంగం సిద్దమవుతోంది. డీపీఎల్ 2025 వేలం జూలై 5న జరగనుంది. ఈ వేలం జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అన్నయ్య వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ కోహ్లీ పేరు కూడా ఉంది. అంతేకాదు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు ఆర్యవీర్, వేదాంత్ కూడా డ్రాఫ్ట్‌లో ఉన్నారు. ఇక్కడ విరాట్ అన్నయ్య కొడుకు, సెహ్వాగ్ కొడుకు పేరు ఆర్యవీర్ కావడం విశేషం. విషయం తెలిసిన […]
‘కన్నప్ప’ చిత్రం ఊహకు మించి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అర్జునుడు, తిన్నడు, కన్నప్పగా మంచు విష్ణు అద్భుతంగా నటించారని కొనియాడారు. కన్నప్ప కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్ అన్ని గొప్పగా అనిపించాయని.. ఇదొక మైల్ స్టోన్ చిత్రం అవుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశానని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. జూన్ […]
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ట్రోఫీ గెలవడంతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకపాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అద్భుత బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంటర్వ్యూలో భాగంగా తన టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను వరుణ్ ఎంచుకున్నాడు. అయితే అతడి జట్టులో టీమిండియా […]
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పేలవ బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో సహా ఐదుగురు బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్స్ తీయలేకపోయాడు. సిరాజ్, ప్రసిద్, జడేజాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండవ టెస్ట్ కోసం మణికట్టు స్పిన్నర్ […]