మిథున రాశి వారికి ఈరోజు వ్యాపారంలో కలిసి వస్తుంటాయి. నూతనమైన పనులను ఆరంభించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బంధువులు, స్నేహితుల సంపూర్ణ సహకారం ఉంటుంది. ఉద్యోగ వ్యవహారిక విషయాలు కలసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ స్వామినాథ స్వామి వారు. సుబ్రమణ్యస్వామి వారి కవచంను పారాయణం చేయండి. మేష రాశి నుంచి మీన రాశి వరకు.. 12 రాశుల వారికి గురువారం నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ కింది […]
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లెటర్లు రాసుడు కాదుని, ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాల్లే అని విమర్శించారు. ఆ కోవర్టులకు కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్లు కట్ చేయండని విజ్ఞప్తి చేశారు. మంచిగ మాట్లాడితే ఆంధ్ర వాళ్లు మాట వినరు అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. Also Read: […]
ఏడాదిలో ఏదో ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయండని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో ఉండే వైద్యులు కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్నారని, వారు నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో సేవ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ఆసుపత్రులను సిద్ధం చేస్తాం అని, త్వరలో 25 ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆస్పత్రిని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి […]
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ప్రమాదంపై సిగాచీ కంపెనీ స్పందించింది. పరిశ్రమలో పేలుడు కారణంగా 40 మంది మృతి చెందారని, మరో 33 మంది గాయపడినట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్ని బీమా క్లైమ్ ఇస్తామని స్పష్టం చేసింది. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని సిగాచీ కంపెనీ హామీ ఇచ్చింది. ఈ మేరకు సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ […]
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట: సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ జరిపింది. బుధవారం విచారించిన ధర్మాసనం.. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని తెలిపింది. సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం కోరింది. తమ […]
తెలంగాణ భవన్లో మాజీమంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. బనకచర్ల అంశం, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన మాట్లాడారు. నిన్న సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని పేర్కొన్నారు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన లేదనిమండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారని, అవన్నీ ప్రజంటేషన్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. తమ పార్టీ సచ్చిన పామే అయితే.. పదే పదే బీఆర్ఎస్ పేరెందుకు ప్రస్తావిస్తున్నారన్నారు. తమకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యమని […]
Gold Price Today in Hyderabad on 2nd July 2025: ఆషాఢ మాసం సీజన్, శ్రావణ మాసం పెళ్లిల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. జూన్ నెలాఖారన వరుసగా 7-8 రోజులుగా తగ్గిన పసిడి ధర మరలా పెరుగుతోంది. జులై మొదటి రోజున బంగారం ధర భారీగా పెరగగా.. ఈరోజు కూడా గోల్డ్ రేట్ పెరిగింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1050 పెరగగా.. ఈరోజు రూ.450 పెరిగింది. […]
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య ఇప్పటివరకు 40 దాటినట్లు సమాచారం. కార్మికులు చనిపోవడంతో సిగాచి పరిశ్రమ మేనేజ్మెంట్పై కేసు నమోదైంది. అయితే సిగాచి పరిశ్రమ, అధికారుల లెక్కలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. Also Read: Medaram Jatara 2026: మేడారం మహాజాతర తేదీలు ఖరారు! ప్రమాద సమయంలో పరిశ్రమలో డ్యూటికి 162 […]
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ‘మేడారం’ మహాజాతర తేదీలు ఖరారు అయ్యాయి. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుందని పూజారుల సంఘం ప్రకటించింది. సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం 2026 మేడారం మహాజాతర తేదీలను ఖరారు చేసి.. దేవాదాయ శాఖకు పంపించింది. త్వరలోనే దేవాదాయ శాఖ ఆమోదం తెలపనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మలు వెలిసి ఉన్న విషయం తెలిసిందే. Also Read: ENG vs IND: నేటి నుంచే […]
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఆధిపత్యాన్ని ప్రదర్శించినా.. చివరికి ఓటమి చవిచూసిన టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటి టెస్టులో భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం అందుకున్న ఇంగ్లండ్.. జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలా అనే సందిగ్ధంలో భారత్ ఉంది. ఈ […]