2 రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో కుప్పంలో పర్యటన కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:50 గంటలకు శాంతిపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ దగ్గరకు రోడ్డు మార్గాన చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నేడు జైలు […]
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం సైతం పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. విత్తనాలు వేసి వర్షం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, […]
నేడు, రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసి ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకోనున్న సీఎం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పార్టీ సమావేశం.. అందుబాటులో ఉన్న నేతలతో వైఎస్ జగన్ సమావేశం నేడు జైలు నుంచి విడుదల కానున్న వల్లభనేని వంశీ.. 138 రోజులుగా జైల్లో ఉన్న వంశీ.. 11 కేసుల్లో వంశీకి బెయిల్.. చివరి కేసులో నిన్న బెయిల్ ఇచ్చిన నూజివీడు కోర్టు లిక్కర్ స్కాం […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది?, ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది?, ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి?, ఎవరు విరమించుకోవాలి?, ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి?, ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది?, మంచి జరగాలంటే ఏం చేయాలి?.. ఇలా పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం. సింహరాశి వారికి ఈరోజు ఆర్ధిక సంబంధమైన వంటి విషయాలు అనుకూలం అవుతుంటాయి. ఊహించని డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవహారిక […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మ్యాచ్ ఆడుతుందంటే.. ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆ జట్టు సహ యజమాని కావ్య మారన్ పైనే అందరి కళ్లు ఉంటాయి. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను ఉత్సహపరుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం నిరాశగా ఉంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కావ్య పాపపై ఎక్కువగా మీమ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా తనపై వచ్చే మీమ్స్‌పై స్పందించారు. క్రికెట్ మీద తనకున్న మక్కువ వల్లే తాను […]
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్‌ను పోలీసులు విచారించకుండా.. న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ఏజీ 2 వారాల గడువు కోరగా.. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. దాంతో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. Also Read: PVN Madhav: బీజేపీని […]
బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పని చేస్తాను అని ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టిన పీవీఎన్ మాధవ్ అన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఈరోజు స్వీకరించారు. ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాధవ్‌కు అప్పగించారు. […]
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏనాడూ రాజీ పడలేదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా.. వైసీపీలో విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం అని, సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలని జగన్ సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం […]
రాజకీయాల్లో స్వలాభాపేక్ష ఏ రోజూ తాను చూసుకోలేదని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. తన రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదన్నారు. తనను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని తాను ఆశిస్తున్నానని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. బీజేపీ జెండాను మాధవ్‌కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను పురంధేశ్వరి అప్పగించారు. మాధవ్ […]
కొనుగోలుదారులకు బంగారం ధరలు మరలా భారీ షాకిచ్చాయి. ఇటీవలి రోజుల్లో వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,050 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1,140 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (జులై 1) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,200గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,400గా నమోదైంది. బంగారం ధర మళ్లీ భారీగా పెరగడంతో వినియోగదారులు […]