Nothing Phone 3 Launch Date in India: లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ‘నథింగ్’ మరో మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 3 సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3ఏను ఇప్పటికే లాంచ్ చేయగా.. ఇప్పుడు ‘నథింగ్ ఫోన్ 3’ను లాంచ్‌కు సన్నాహాలు చేసింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నథింగ్ ఫోన్ 3ను కంపెనీ జూలై 1న లాంచ్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ‘హెడ్‌ఫోన్ 1’ని కూడా నథింగ్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఇది […]
సూపర్ ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ రెండో టెస్ట్‌లో కూడా రాణిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పంత్ పరుగుల దాహంతో ఉన్నాడని, అతడు కచ్చితంగా మరిన్ని రన్స్ సాధిస్తాడన్నాడు. రాహుల్ ఒక్క శతకంతోనే ఆగిపోడని, మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని మంజ్రేకర్ తెలిపాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌లో జులై […]
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం యశస్వి ముందుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో జైస్వాల్ 97 పరుగులు చేస్తే.. అరుదైన రికార్డు ఖాతాలో చేరనుంది. ప్రస్తుతం 20 టెస్టుల్లో (38 ఇన్నింగ్స్‌లు) 1903 పరుగులు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు […]
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడని తెలుస్తోంది. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు. తాను అన్ని మ్యాచ్‌లు ఆడలేనని సిరీస్‌కు ముందే బుమ్రా చెప్పగా.. అందుకు బీసీసీఐ ఒకే చెప్పింది. బీసీసీఐపై […]
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌కు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యానని అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఏవేవో ఆలోచనలతో తన కాళ్లు, చేతులు ఆడలేదని.. ఆ రోజు రాత్రి నిద్రపోలేదని చెప్పాడు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ కచ్చితంగా సిక్స్ పోతుందనుకున్నా అని, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడని ప్రశంసించాడు. కీలక సమయంలో రిషబ్ పంత్‌కు గాయం అయిందని కంగారు పడ్డా అని, అయితే బ్యాటర్ల లయను […]
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి ఆరోపించారు. దయాళ్ తనను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దయాళ్‌తో తాను గత ఐదు ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్లు రాసుకొచ్చారు. ఈ మేరకు సదరు యువతి యూపీ సీఎం ఆన్లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. యష్ దయాళ్‌కు అనేక మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని […]
కర్నూలు జెడ్పీ సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే పార్థ సారథి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం సూటిగా చెప్పాలని ఎమ్మెల్యే పార్థ సారథికి జెడ్పీ చైర్మన్ సూచించారు. రైతు సమస్యలపై చర్చించే ఓపిక లేకుంటే ఎలా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. టైం లేకుంటే మీరు వెళ్లిపోండని, తాము చర్చించుకుంటాం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్రమంలో జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు […]
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎంపీ పాకా సత్యనారాయణ విజయవాడలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. పాకా సత్యనారాయణ మాట్లాడుతూ… ‘అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక పార్టీ […]
గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట: గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట లభించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కాంట్రాక్ట్ వాటర్ వర్కర్స్ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చలలో జీవీఎంసీ గడువు కావాలని కోరింది. వర్కర్స్ డిమాండ్లను బుధవారం లోపు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. జీవీఎంసీ మాట తప్పితే.. శుక్రవారం నుంచి తిరిగి నిరవధిక సమ్మెకు వెళతాం అని యూనియన్లు హెచ్చరించాయి. తాత్కాలిక సమ్మె విరమణతో కాంట్రాక్ట్ […]
దేశంలోని పసిడి ప్రియులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. లక్ష రూపాయలకు పైగా ఎగబాకిన పసిడి రేట్లు.. రోజు రోజుకు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 90 వేలకు దిగొచ్చింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్లో శనివారం (జూన్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి […]